అంతర్జాతీయం

చైనాపై వృద్ధ జనాభా భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 2: మరో నాలుగేళ్ల కాలంలో చైనా జనాభాలోని 17 శాతం మంది 60ఏళ్లు పైబడిన వృద్ధులే కాబోతున్నారు. అంటే 2020 నాటికి చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య 240 మిలియన్లకు చేరుకుంటుందని తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో స్పష్టమైంది. దీనివల్ల చైనా ఆరోగ్య వ్యవస్థపైన తీవ్ర ప్రభావం పడుతుందని, అదే విధంగా కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య 220 మిలియన్ల మేర ఉంది. దేశంలో వృద్ధ జనాభా పెరిగిపోతున్న విషయాన్ని, దానివల్ల కార్మికుల సంఖ్య తగ్గడం, తత్ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రసరితమయ్యే ప్రభావాల గురించి చైనా జాతీయ ఆరోగ్య కుటుంబ ప్రణాళికా కమిషన్ ఉపాధిపతి లియూకియాన్ వెల్లడించారు. ఇప్పటికే తీవ్రస్థాయిలో చైనా జనాభాను అంటువ్యాధులు పీడిస్తున్నాయని, 260 మిలియన్ల మంది ఏదో ఒక రకమైన వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారు. చైనాలో ఇప్పటివరకు సంభవించిన మరణాల్లో 86 శాతం ఈ రకమైన వ్యాధులవల్లేనని తెలిపారు.