అంతర్జాతీయం

18ఏళ్లుగా పన్ను కట్టని ట్రంప్?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 2: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ పన్నుల ఎగవేత వ్యవహారం ఆయన అభ్యర్థిత్వంపైనే పెను ప్రభావం కనబరిచే అవకాశం కనిపిస్తోంది. గత 18 ఏళ్లుగా ట్రంప్ అసలు పన్నులే కట్టి ఉండకపోవచ్చునంటూ తాజాగా వెలువడిన కథనంతో పరిస్థితి ఆయనకు మరింత తీవ్రంగా మారింది. ముఖ్యంగా, తన పన్నుల వివరాలను వెల్లడించడానికి ట్రంప్ నిరాకరిస్తున్న నేపథ్యంలో వెలువడిన ఈ కథనం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. 1995లో ఆదాయం పన్ను వివరాలను దాఖలు చేసిన ట్రంప్ 916 మిలియన్ డాలర్ల మేర నష్టం వచ్చిందని ప్రకటించారు. అప్పటినుంచి 18 ఏళ్లుగా తన ఆదాయపు వివరాలను వెల్లడించనే లేదు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు తమ ఆదాయ పన్ను వివరాలను వెల్లడించడం ఆనవాయితీ.
కాని ట్రంప్ మాత్రం తన ఆదాయపు పన్ను వివరాలను వెల్లడించకుండా దాటవేత ధోరణినే అవలంబిస్తూ రావడంతో వ్యవహారం ముదురుపాకాన పడింది.