అంతర్జాతీయం

బీటింగ్ రిట్రీట్‌లో పాక్ వైపునుంచి రాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాఘా, అక్టోబర్ 2: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న వాఘా-అటారీ సరిహద్దు పోస్టు వద్ద ప్రతిరోజూ సాయంత్రం జరిగే బీటింగ్ రిట్రీట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. సూర్యాస్తమయం సమయంలో ఇరుదేశాల ఉమ్మడి సరిహద్దు మార్గం అయిన ఈ పోస్టును మూసివేసే ముందు సరిహద్దును కాపలా కాసే బిఎస్‌ఎఫ్, పాకిస్తాన్ రేంజర్స్ జరిపే ఈ కవాతును తిలకించడానికి ఇరువైపులనుంచి పెద్ద సంఖ్యలో జనం రోజూ వస్తుంటారు. దశాబ్దాలుగా ప్రతి రోజూ జరిగే ఈ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ఎంతో ప్రశాంతంగా సాగిపోతూ వస్తోంది. అయితే ఉరీ ఉగ్రవాద దాడి, అనంతరం భారత సైన్యాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన మెరపుదాడి అనంతరం ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బీటింగ్ రిట్రీట్ జరుగుతుండగా పాక్ వైపునుంచి జనాలు భారత జవాన్లపైకి బండరాళ్లు విసిరారు. బీటింగ్ రిట్రీట్‌లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. బిఎస్‌ఎఫ్ దళాలు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించడమే కాకుండా పాకిస్తాన్ రేంజర్స్‌కు ఫిర్యాదు కూడా చేసింది. అయితే పాక్ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. కాగా, ఈ అంశాన్ని చర్చించడానికి ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేయాలని బిఎస్‌ఎఫ్ పాక్ రేంజర్స్‌ను కోరింది. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా బీటింగ్ రిట్రీట్ మాత్రం మామూలుగా కొనసాగింది.