జాతీయ వార్తలు

కడపలో స్టీల్ ప్లాంట్‌పై టాస్క్ ఫోర్సు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని బయ్యారంలలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రావు బీరేంద్రసింగ్ తెలిపారు. ఆయన ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. ఉక్కు శాఖకు చెందిన సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు కాబోయే ఈ టాస్క్ఫోర్సులో సెయిల్, ఆర్‌ఐఎన్‌ఎల్, ఎన్‌ఎండిసి, మెకాన్ సంస్థలకు చెందిన ఒక్కొక్క డైరెక్టర్ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు ఏపి, తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రతినిధులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. రెండు ఉక్కు కర్మాగారాలు వాణిజ్యపరంగా అనుకూలం కాకపోవచ్చునని సెయిల్ అధికారులు ఇచ్చిన నివేదికపై వెంకయ్యనాయుడు ఇటీవల ఉక్కు మంత్రిని కలిసి చర్చించారు. వెంకయ్య విజ్ఞప్తి మేరకు రెండు ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై బీరేంద్ర సింగ్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశారు.