అంతర్జాతీయం

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోం, అక్టోబర్ 5: రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఈసారి మూడు దేశాలకు చెందిన ముగ్గురు శాస్తవ్రేత్తలు సంయుక్తంగా సాధించుకున్నారు. అణు మెషిన్స్ (మాలిక్యులర్ మెషిన్స్)ను అభివృద్ధి చేసినందుకు గాను ఫ్రాన్స్ శాస్తవ్రేత్త జీన్ పిర్రె సౌవేజ్, బ్రిటన్‌లో జన్మించిన జె ఫ్రాజర్ స్టోడ్డార్ట్, డచ్ సైంటిస్ట్ బెర్నార్డ్ ఫెరింగాలను బుధవారం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. నియంత్రిత చలనం ద్వారా అణువుల ‘ఆకృతిని, సంయోజనం’ను అభివృద్ధి చేసినందుకు ఈ ముగ్గురు శాస్తవ్రేత్తలకు 8 మిలియన్ల క్రోనోర్ (930,000 డాలర్లు) బహుమతి మొత్తాన్ని పంచనున్నట్టు రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సైనె్సస్ తెలిపింది. శక్తిని అందజేసినప్పుడు అణువులు పనిచేయగలుగుతాయని పేర్కొంది. కొత్త వస్తువులు, సెన్సర్లు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లు వంటి వాటిని అభివృద్ధి చేయడానికి మాలిక్యులర్ మెషిన్లను ఉపయోగిస్తారని అకాడమి వివరించింది. సైన్స్‌లో ఈ సంవత్సరం ప్రకటించిన నోబెల్ బహుమతుల్లో రసాయన శాస్త్రంలో ప్రకటించిన బహుమతే చివరిది. ఇదివరకే ప్రకటించిన వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని జపాన్‌కు చెందిన శాస్తవ్రేత్త దక్కించుకోగా, భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురు బ్రిటన్ శాస్తవ్రేత్తలు పంచుకున్నారు. నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించనున్నారు. అర్థశాస్త్రం, సాహిత్యంలో నోబెల్ బహుమతులను వచ్చే వారం ప్రకటిస్తారు. డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేస్తారు.

రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న ఫ్రాన్స్ శాస్తవ్రేత్త జీన్ పిర్రె సౌవేజ్, బ్రిటన్‌లో జన్మించిన జె ఫ్రాజర్ స్టోడ్డార్ట్, డచ్ సైంటిస్ట్ బెర్నార్డ్ ఫెరింగా