అంతర్జాతీయం

పాక్ రైలులో పేలిన రిమోట్ బాంబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, అక్టోబర్ 7: బలూచిస్తాన్‌లో ఓ రైలులో సంభవించిన 2 రిమోట్ బాంబు పేలుళ్లలో ఆరుగురు దుర్మరణం చెందారు. 14 మంది గాయపడ్డారు. క్వెట్టా నుంచి రావల్పింది వైపువస్తున్న జఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. బోలాన్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై అమర్చిన బాంబులను రైలు రాగానే రిమోట్ కంట్రోల్‌తో పేల్చివేసినట్టు పోలీసులు వెల్లడించారు. రెండు బాంబులు ఒకదానితరువాత ఒకటి పేలినట్టు వారు చెప్పారు. క్షతగాత్రులను క్వెట్టా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పేలుళ్లపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి నవాజ్ సనౌల్లా జెహ్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుళ్ల బాధ్యులను అరెస్టు చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు. పథకం ప్రకారమే ఈ దాడులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా పేలుళ్లుకు తమదే బాధ్యత అని ఇంత వరకూ ఏ సంస్థా ప్రకటించుకోలేదు. స్వతంత్ర ప్రతిపత్తికోసం పోరాడుతున్న బలూచిస్తాన్ వేర్పాటువాదులు ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. గత జనవరిలో సిబి జిల్లాలోని మిత్రి ప్రాంతంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు.