అంతర్జాతీయం

ఉగ్రవాద దేశంగా పాక్‌ను గుర్తించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 7: పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించే బిల్లును తాము సమర్థించబోమని అమెరికా శువ్రారం స్పష్టం చేసింది. అయితే భారత్‌కు కూడా ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను తుడిచిపెట్టడానికి ఈ ప్రాంతంలోని దేశాల ప్రభుత్వాలతో కలిసి పని చేస్తామని తెలిపింది. కాశ్మీర్ సహా అన్ని విభేదాలను పరిష్కరించుకోవడానికి, ఇటీవలి ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి అర్థవంతమైన చర్చలు జరపాలని కూడా భారత్, పాక్‌లకు అమెరికా పిలుపునిచ్చింది. అయితే పాకిస్తాన్ తన అణ్వస్త్రాలను ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా సురక్షితంగా ఉంచడానికి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుందన్న నమ్మకాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ వ్యక్తం చేశారు.
అమెరికాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన బిల్లును, ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రభుత్వం సమర్థిస్తుందా అని కిర్బీని రోజువారీ మీడియా సమావేశంలో విలేఖరులు అడగ్గా, ఆ బిల్లులో కొత్తగా ఏమీ లేదని, అందుకే దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆయన చెప్పారు. దక్షిణాసియాలోని దేశాలకు ఉమ్మడి ముప్పు అయిన ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఈ ప్రాంత దేశాల ప్రభుత్వాలతో తాము కలిసి పని చేస్తూనే ఉంటామని కిర్బీ స్పష్టం చేశారు. కాశ్మీర్ విషయంలో అమెరికా ప్రభుత్వ వైఖరి మారలేదని, ఇప్పుడున్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి, అలాగే పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత్, పాక్‌ల మధ్య అర్థవంతమైన చర్చలు జరగాలని తాము కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. అయితే రెండు దేశాల మధ్య విభేదాలున్న మాట నిజమేనని ఆయన అంటూ, అమెరికాకు కూడా చాలా దేశాలతో విభేదాలున్నాయని, అయితే వాటిని పరిష్కరించుకోవడానికి తా ము ప్రయత్నిస్తున్నామని, అలాగే ఆ రెండు దేశాలు కూడా తమ విభేదాలను పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నామని కిర్బీ చెప్పారు.