అంతర్జాతీయం

కాశ్మీర్ పరిష్కారమైతేనే కాబూల్‌లో శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 7: నిన్న మొన్నటివరకు కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ కాశ్మీర్ సమస్య పరిష్కారమయితేనే దక్షిణాసియాలో శాంతి నెలకొంటుందని చెప్తూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు కొత్త పాట మొదలుపెట్టింది. అఫ్గానిస్థాన్‌లో శాంతికి, కాశ్మీర్‌కు లంకెపెట్టింది. అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొనాలంటే కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని అంటోంది. ‘కాబూల్‌లో శాంతి కాశ్మీర్‌తో ముడిపడి ఉంది. శాంతిగురించి మాట్లాడేటప్పుడు దాన్ని విడివిడిగా చూడడానికి వీలు లేదు... కాబూల్‌లో శాంతి నెలకొల్పి కాశ్మీర్‌ను మండిస్తూనే ఉందామంటే కుదరదు. అలా ఎప్పటికీ జరగదు’ అని కాశ్మీర్‌పై పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రత్యేక దూత ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ అని అన్నారు. ‘కాబట్టి మీరు(అమెరికా) సమగ్ర శాంతి గురించి మాట్లాడండి’ అని పాకిస్తాన్ సెనేట్‌లో రక్షణ, రక్షణ పరికరాల ఉత్పత్తి కమిటీ చైర్మన్ కూడా అయిన ముషాహిద్ వాషింగ్టన్‌లోని స్టింసన్ సెంటర్‌లో జరిగిన ఓ చర్చాగోష్ఠిలో మాట్లాడుతూ అన్నారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యురాలయిన షెజ్రా మన్సాబ్‌తో కలిసి ఆయన కాశ్మీర్‌పై పాక్ ప్రధాని ప్రత్యేక దూతలుగా అమెరికా వచ్చారు. ఇప్పుడు మా ప్రధాన సమస్య కాశ్మీర్. ఈ సమస్య పరిష్కారం కాకుండా ఈ ప్రాంతంలో శాంతి సాధ్యం కాదు. ఇది అంతర్గత సమస్య కాదు, అంతర్జాతీయ సమస్య. ప్రస్తుతం రెండు అణ్వస్త్ర దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. అందువల్ల కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యాకే మిగతా వాటి గురించి ఆలోచించాలి’ అని మన్సాబ్ అన్నారు. ఎలాంటి షరతులు పెట్టకుండా చర్చలు జరపడానికి తమ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రతిపాదించారని, అయితే భారత్ ఏ అంశంపైన కూడా మాట్లాడడానికి ఇష్టపడ్డం లేదన్నారు. ‘మేము ఒకే అంశంపై మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని భారత్ అంటోంది. అయితే ఆ అంశం సహా ఇతర అంశాలపైన కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్తున్నాం’ అని ఆమె స్పష్టం చేశారు.