అంతర్జాతీయం

మళ్లీ హిల్లరీదే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ లూయిస్, అక్టోబర్ 10: రెండో బిగ్ డిబేట్‌లోనూ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీదే పైచేయి అయింది. అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలు అత్యంత నిర్ణయాత్మక దశకు చేరుకున్న తరుణంలో జరిగిన తాజా డిబేట్‌లో ఇటు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌తో హిల్లరీ ముఖాముఖీ ఢీకొన్నారు. రోజురోజుకూ దిగజారుతున్న తన ప్రాభవాన్ని కాపాడుకునేందుకు ట్రంప్ తీవ్రస్థాయిలోనే హిల్లరీపై రెచ్చిపోయారు. ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కూడా రచ్చకీడ్చారు. రాజకీయ ప్రత్యర్థులుగా తలపడుతూనే వ్యక్తిగతంగా కూడా తీవ్రస్థాయిలో పరస్పర విమర్శలకు దిగారు. ఆదివారం ఇక్కడి వాషింగ్టన్ యూనివర్శిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య పోటీ మరింత ముదిరిందని చెప్పడానికి తార్కాణంగా నిలిచే పరిణామాలెన్నో చోటుచేసుకున్నాయి. వేదికపైకి వచ్చిన ట్రంప్‌తో కనీసం మర్యాద పూర్వకంగా కూడా హిల్లరీ కరచాలనం చేయలేదు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ ఈ చర్చా వేదికపై హిల్లరీ క్లింటన్ భర్త అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పై అప్పట్లో వచ్చిన లైంగికపరమైన దుష్ప్రవర్తన ఆరోపణలను లేవనెత్తారు. అంతేకాకుండా తాను అధ్యక్షుడిగా ఎన్నికయితే ఈ-మెయిల్‌ల వివాదంలో ఆమెను జైలుకు పంపిస్తానని అన్నారు. పరస్పర వ్యక్తిగత విమర్శలతో దిగజారిన స్థాయిలో అవాంఛనీయమైన వాతావరణంలో సాగిన ఈ రెండో చర్చాకార్యక్రమంలో హిల్లరీ క్లింటన్‌ను విజేతగా ప్రకటించారు. సుమారు గంటన్నర సేపు పరస్పర విమర్శలతో సాగిన చర్చా కార్యక్రమం తరువాత పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్‌లో హిల్లరీని విజేతగా ప్రకటించారు. హద్దుమీరిన ప్రవర్తన గల వ్యక్తిగా 70ఏళ్ల ట్రంప్‌ను అభివర్ణించారు. ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలన్న ట్రంప్ ప్రణాళికపై 68ఏళ్ల హిల్లరీ క్లింటన్ విరుచుకుపడ్డారు. ఇది హ్రస్వదృష్టితో కూడిన, ప్రమాదకరమైన ప్రణాళిక అని, ముస్లిం మతం గురించి ఆయన చేసినవి వాగాడంబరమైన ఉపన్యాసాలని ఆమె విమర్శించారు. ఒబామా కేర్, పన్నులు, ఇస్లామాఫోబియా వంటి అంశాలపైనా ఈ ఇద్దరు నేతలు పరస్పరం విమర్శలకు దిగారు. ట్రంప్ 2005నాటి వీడియోలో మహిళల గురించి చేసిన అశ్లీలమైన, లైంగికపరమైన వ్యాఖ్యలను హిల్లరీ క్లింటన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ వీడియోలు బయటకు వచ్చిన తరువాత ట్రంప్‌కు మద్దతు పడిపోవడమేకాక స్వంత పార్టీ నేతలు కూడా కొందరు ఆయనకు మద్దతును ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే హిల్లరీ చేసిన విమర్శలపై తీవ్రంగా స్పందించిన ట్రంప్.. ఆమె భర్త బిల్ క్లింటన్ కొనే్నళ్లపాటు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికయితే, అమెరికా విదేశాంగ మంత్రిగా పనిచేసిన కాలంలో హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ ఈ-మెయిల్ సర్వర్‌ను ఏర్పాటు చేసుకోవడంపై ప్రత్యేకంగా విచారణ జరిపిస్తానని, తద్వారా ఆమెను జైలుకు పంపిస్తానని అన్నారు. నవంబర్ 8న అధ్యక్ష ఎన్నికలు జరగడానికి ముందు జరగాల్సిన మూడు చర్చాకార్యక్రమాలలో మూడోది ఈ నెల 19న లాస్ వెగాస్‌లో జరుగనుంది.