అంతర్జాతీయం

వేడెక్కిన ‘వైట్‌హౌస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 12: అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు శరవేగంగా సమీపిస్తుండటంతో డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ వాతావరణం పెరిగిపోయింది. ఇప్పటివరకు ఓ మోస్తరుగా సాగిన ప్రచారం వ్యక్తిగత స్థాయికి కూడా దిగజారి, ఇరు పార్టీల నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు విరుచుకుపడేందుకు దారితీసింది. రెండు బిగ్ డిబేట్‌లలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై విజయం సాధించిన డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తన విమర్శల తూటాలకు మరింతగా పదును పెట్టారు. వాతావరణ మార్పులను వ్యతిరేకిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకోవడం అంటే పర్యావరణాన్ని కాలరాయడమేనని హిల్లరీ స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లోకి ఇలాంటి వ్యక్తి ప్రవేశించడమన్నది అమెరికాకే కాకుండా ప్రపంచానికే క్షేమదాయకం కాదన్నారు. మరోపక్క డొనాల్డ్ ట్రంప్‌కూడా హిల్లరీని లక్ష్యంగా చేసుకొని తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హిల్లరీ క్లింటన్ అవినీతికి చిరునామా అనీ, ఒకవేళ ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా పరిస్థితి తారుమారవుతుందని హెచ్చరించారు. అదే జరిగితే అమెరికా అస్తిత్వాన్ని కోల్పోతుందని, విదేశీ ప్రభుత్వాలు, డోనర్లే రాజ్యం చేస్తారంటూ హెచ్చరించారు.
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడానికి అవసరమైన కనీస పరిజ్ఞానం, నిజాయితీ, జ్ఞానం, స్వభావం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఈషన్మాత్రమైనా లేవని అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశాధ్యక్షుడికి ఉండాల్సిన కనీస లక్షణాలను పెంపొందించుకోవాలన్న ఆలోచన కూడా ట్రంప్‌కు ఏ కోశానా లేవన్నారు. మరో నాలుగు వారాలపాటు విస్తృత స్థాయిలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ తరపున ప్రచారం చేయనున్న ఒబామా ఆమె ప్రత్యర్థిపై తీవ్ర స్వరంతోనే విరుచుకుపడ్డారు. గతంలో రిపబ్లికన్ పార్టీ తరపున జాన్ మెకైన్, మిట్ రోనీలు పోటీపడ్డారని, వారిద్దరితో పోలిస్తే ట్రంప్‌ది చాలా భిన్నమైన, విరుద్ధమైన స్వభావమని తెలిపారు. ఇలాంటి వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవిని చేపడితే పరిస్థితులు దారుణంగా దిగజారిపోతాయని పేర్కొన్నారు.