అంతర్జాతీయం

ట్రంప్‌తో ప్రపంచానికే ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, అక్టోబర్ 12:అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే ప్రపంచానికే ముప్పని ఐక్యరాజ్య సమితి హక్కుల విభాగం అధినేత జీద్ రాద్ అల్ హుస్సేన్ హెచ్చరించారు. జెనీవాలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అమెరికా రాజకీయ ప్రచారంలో పాల్గొనాలన్న ఉద్దేశం తనకు లేనప్పటికీ ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో ట్రంప్‌కు సంబంధించి ఈ అభిప్రాయం కలుగుతోందని చెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ట్రంప్ చేస్తున్న ప్రకటనలు సర్వత్రా ప్రకంపనలు పుట్టిస్తున్నాయన్నారు. ట్రంప్ ధోరణిలో మార్పు రాకపోతే మాత్రం ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే అత్యంత ప్రమాదకర పరిణామాలే తలెత్తుతాయన్నారు.