అంతర్జాతీయం

నన్ను బలిపశువును చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 14: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఓ వైపు మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు, మరో పక్క లైంగికపరమైన ఆరోపణలు ముప్పిరిగొనడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు మాట మార్చేశారు. తనను బలి పశువును చేస్తున్నారని, ఇదంతా తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పన్నిన కుట్రని వాపోయారు. అలాగే మరో పక్క అమెరికా యువతను ఆకట్టుకోవడానికి వారికి న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాలను కాపాడుతానని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ట్రంప్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ కొంతమంది మహిళలు గురువారం ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే వారు చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం కానీ, లాజిక్ కానీ లేవని ట్రంప్ అన్నారు. అంతేకాదు అమెరికా కార్పొరేట్ మీడియాపైనా ట్రంప్ మండిపడుతూ, వాళ్లు చేస్తున్నది జర్నలిజం కాదని అన్నారు. కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్న పత్రికలు రాజకీయ ప్రత్యేక ఆసక్తితో ఒక లాబీయిస్టు లేదా ఆర్థిక సంస్థ మాదిరిగా పని చేస్తున్నాయని అన్నారు. ‘ఎన్ని జీవితాలు నాశనమైనా పరవాలేదు కానీ హిల్లరీ క్లింటన్‌ను గెలిపించాలన్నదే వాటి ఏకైక అజెండా. వాళ్లకు ఇదో యుద్ధంతో సమానం. అయితే ఇది మన దేశం మనుగడకోసం జరుగుతున్న పోరాటం. నన్ను నమ్మండి. దాన్ని కాపాడుకునేందుకు నవంబర్ 8 చివరి అవకాశం అనే విషయాన్ని మరిచిపోవద్దు’ అని ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్‌బీచ్‌లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ట్రంప్ అన్నారు. అమెరికా ఒక స్వతంత్ర దేశమా, అక్కడ ప్రజాస్వామ్యమనే భ్రాంతి మాత్రమే ఉందా, లేక వాస్తవానికి వ్యవస్థను నాశనం చేసే కొన్ని అంతర్జాతీయ ప్రయోజనాలు కలిగిన శక్తుల చేతుల్లో దేశం ఉందా అనే దాన్ని ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయని ఆయన అన్నారు.
కాగా, మరోసారి హెచ్-1బి వీసాల అంశాన్ని లేవనెత్తిన ట్రంప్ అమెరికా కంపెనీలు వర్కింగ్ వీసాలపై తక్కువ వేతనాల ఉద్యోగులను దిగుమతి చేసుకుంటున్నాయని ఆరోపించారు. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను కాపాడి తీరుతానని ఆయన హామీ ఇచ్చారు. ‘తమ పిల్లలకు ఉద్యోగాలు దొరకవని దేశవ్యాప్తంగా చాలామంది తల్లులు ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనకు ప్రధాన కారణం ఔట్‌సోర్సింగ్. కాలేజిల్లో చదువుకొన్న వారికి దక్కాల్సిన ఉద్యోగాలను ఇతర దేశాలకు పంపించేస్తున్నారు’ అని ట్రంప్ ఆరోపించారు.