అంతర్జాతీయం

విశ్వంలో 2 ట్రిలియన్ల గెలాక్సీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 14: విశ్వం లోతుల్లోకి వెళ్లేకొద్దీ నిగూఢమైన ఎన్నో రహస్యాలు వెలుగులోకి వస్తు నే ఉన్నాయి. ఈ విశ్వంలో ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయన్నదానిపై ఎన్నో రకాలుగా పరిశోధనలూ జరిగాయి. శాస్త్ర పరిశోధన పరిధి ఇప్పటి వరకూ విస్తరించినంత వరకూ కనిపించిన గెలాక్సీలు వంద బిలియన్‌కు పైనే ఉన్నాయి. అయితే గత ఇరవై ఏళ్లుగా హబుల్ రోదసీ టెలీస్కోపు అందించిన వివరాలు, చాయాచిత్రాలను బట్టి చూస్తే విశ్వంలో గతంలో అంచనా వేసినదానికంటే ఇరవై రెట్లు ఎక్కువగా అంటే దాదాపు రెండు ట్రిలియన్ల గెలాక్సీలు ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. అత్యంత సూక్షమైన కాంతులను ప్రసరిస్తున్న గెలిక్సీలను సైతం హబుల్ టెలీస్కోపుపసిగట్టగలిగింది. నోటింగమ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ క్రిస్ట్ఫర్ కాన్సలీస్ సారధ్యంలో జరగిన ఈ అధ్యయనం విశ్వలోతులను మరింత స్పష్టంగా ఆవిష్కరించింది. గత అంచనాలకంటే కూడా కచ్చితంగా 20 రెట్లు ఎక్కువగానే నక్షత్ర మండలాలు ఉన్నాయని ఈ అంతర్జాతీయ అధ్యయనంలో స్పష్టమైంది. ప్రస్తుతం రోదసీ పరిజ్ఞానాన్ని ఎంతగానో విస్తరించుకున్నప్పటికీ కేవలం పది శాతం గెలాక్సీలను మాత్రమే పసిగట్టగలిగామని అధ్యయన కర్తలు తెలిపారు. మరింత స్పష్టమైన, శక్తివంతమైన టెలిస్కోపులను రూపొందించుకోగలిగితేనే మిగతా 90 శాతం గెలాక్సీల ఉనికిని లేసమాత్రంగానైనా తెలుసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వీటి ఆనుపానులను ఇప్పటివరకూ గుర్తించలేకపోవడానికి కారణం ఇవి ఊహకైనా అందనంత విశ్వలోతుల్లో ఉండడమేనని వీటి నుంచి ప్రసరించే కాంతి కూడా టెలిస్కోపులకు అందనంత బలహీనంగా ఉండడమేనని తెలిపారు.