అంతర్జాతీయం

భూతాపం తగ్గింపుపై మరో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిగాలి, అక్టోబర్ 15: వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో శనివారం మరో చారిత్రక ముందడుగు పడింది. కార్బన్ డయాక్సైడ్‌కన్నా వెయ్యి రెట్లు భూతాపాన్ని పెంచగలిగే సామర్థ్యం కలిగి ఉన్న హైడ్రోఫ్లూరో కార్బన్ (హెచ్‌ఎఫ్‌సి)లను దశలవారీగా తగ్గించడానికి భారత్‌తో సహా 200 దేశాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఫ్రిజ్‌లు, ఎయిర్ కండిషనింగ్, ఏరోసోల్ స్ప్రేలలో విస్తృతంగా వాడే హైడ్రోఫ్లూయిడ్ కార్బన్స్‌ను దశలవారీగా తగ్గించడానికి సంబంధించి కిగాలీ సవరణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి మాంట్రియల్ ఒప్పందానికి సవరణ చేయడంపై ప్రపంచ దేశాల మధ్య ఉన్న విభేదాలను తొలగించుకోవడానికి రువాండా రాజధాని కిగాలీలో నిన్న రాత్రంతా వివిధ దేశాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగిన తర్వాతఈ ఒప్పందం కుదిరింది. ఓజోన్ పొరను దెబ్బతీయగల సామర్థ్యం కలిగిన ఈ గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గించడం కోసం మాంట్రియల్ ఒప్పందానికి చేసిన సవరణకు 197 దేశాలు అంగీకారం తెలిపాయి. దీనివల్ల ఈ శతాబ్దాంతానికి భూ తాపం 0.5 డిగ్రీల సెల్సియస్ పెరగకుండా నిరోధించడానికి వీలవుతుంది.
ఈ ఒప్పందం ప్రకారం ముందుగా అమెరికా, ఐరోపాకు చెందిన అభివృద్ధి దేశాలు 2036 నాటికి హెచ్‌ఎఫ్‌సి వినియోగాన్ని 85శాతం తగ్గించుకుంటాయి. ఆ తర్వాత చైనా, భారత్, మరో తొమ్మిది దేశాలు, చివరగా దక్షిణాసియా, పశ్చిమాసియాకు చెందిన మిగతా దేశాలు ఈ హెచ్‌ఎఫ్‌సి వినియోగాన్ని తగ్గించుకుంటాయి. మొత్తంమీద 2045 నాటికల్లా ఈ హెచ్‌ఎఫ్‌సి వినియోగం 85 శాతం మేర తగ్గుతుంది.
మన అభివృద్ధిని పారిశ్రామిక ప్రయోజనాలను, అదే సమయంలో దేశ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగకుండా తాము జాగ్రత్త పడ్డామని ఈ చర్చల్లో మన దేశం తరఫున పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే చెప్పారు. ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబమని, వసుధైక కుటుంబంలో బాధ్యతాయుతమైన సభ్యురాలిగా భారత్ ఈ ఒప్పందం కుదరడానికి తన వంతు పాత్రను పోషించిందని ఆయన చెప్పారు. కాగా, భారత్‌కు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అలాగే మొత్తం ప్రపంచం ప్రయోజనాలకు ఉత్తమమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్న లక్ష్యంతో తాము ఇక్కడికి వచ్చామని, దాన్ని సాధించగలిగామని విలేఖరులతో మాట్లాడిన కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి అజయ్ నారాయణ్ ఝా చెప్పారు. దేశాలు, లేదా ప్రాంతీయ ఆర్థిక సమీకృత కూటములు ఈ ఒప్పందానికి ఆమోదముద్ర తెలిపే పత్రాలను సమర్పించినట్లయితే 2019 జనవరి 1నుంచి ఈ ఒప్పందం అమలులోకి వస్తుంది.

చిత్రం... కిగాలి సమావేశానికి హాజరైన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, రాయబారి ఇరికా రగ్గల్స్‌తో రువాండా అధ్యక్షుడు పాల్ కగామె, విదేశీ వ్యవహారాల మంత్రి లూయస్ ముషికివబా