అంతర్జాతీయం

మేకప్ ‘మహిమ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 19: తాను వలచింది రంభ... తాను మునిగింది గంగ - ఇది తెలుగు సామెతే అయినా, ఈ నవ అరబ్ జంటకు అక్షరాలా అతికిపోతుంది. తాను పెళ్లాడింది అప్సరస అనుకున్నాడు, ఆమె అందాల్ని చూసి మైమరచిపోయి వివాహమాడాడు. తీరా పెళ్లయిన తర్వాత తొలిసారిగా ఆమె అందాన్ని చూసి ఖిన్నుడయ్యాడు. స్విమ్మింగ్ పూల్‌లో దిగి బయటకొచ్చిన తర్వాత గానీ ఆమె అసలు రూపం బయటపడలేదు. అంతే, విడాకులు కోరాడు. మితిమీరిన మేకప్ ఎంత చేటు తెస్తుందో అనేదానికి ఈ ఉదంతమే ఓ ఉదాహరణ.
దుబాయ్‌కు చెందిన 34 ఏళ్ల యువకుడికీ, 28 ఏళ్ల అమ్మాయికి ఈమధ్యే వివాహమైంది. పెళ్లికి ముందు ఆమె అందాలను చూసిన ముచ్చటపడ్డాడు. అయితే స్విమ్మింగ్‌పూల్‌లో స్నానం చేసి బయటకొచ్చిన తన భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె నా భార్యనే అన్న మీమాంసలో పడిపోయాడు. ఇన్నాళ్లూ మేకప్‌తో నెట్టుకొచ్చిన ఆమె కృత్రిమ అందచందాలు స్మిమ్మింగ్‌పూల్‌లో కొట్టుకుపోవడంతో అసలు రూపురేఖలు బయటపడ్డాయి. ఇంకేముంది... వారి బంధం కాస్తా విడాకులకు దారితీసింది. మోతాదుకు మించి కాస్మొటిక్స్ వాడిందనీ, కృత్రిమ కనుబొమ్మలు కూడా పెట్టుకుని తనను మోసగించిందని అతడు వాపోయాడు. తన భార్య అసలు రూపంతో సర్దుకోలేక, మనసు చంపుకోలేక విడాకులు తీసుకున్నాడు. అనుకోని పరిణామంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఆ యువతి మానసిక చికిత్స కోసం డా. అబ్దుల్ అజీజ్ అసఫ్ అనే వైద్యుడ్ని సంప్రదించింది. తన భర్తకు నిజం చెప్పాలనుకున్నాననీ, అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందని ఆమె ఆవేదన చెందుతున్నట్లు డా. అసఫ్ తెలిపారు. వారిద్దర్నీ ఒక్కటి చేసే ఏ ప్రయత్నాన్నీ ఆమె భర్త ఆమోదించడం లేదని ఆయన పేర్కొన్నారు.