అంతర్జాతీయం

సూకీ జయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైన్మార్‌లో జరిగిన చారిత్ర ఎన్నికలు సైనిక పాలనకు స్వస్తిచెప్పి ప్రజాస్వామ్య పాలనా విధానానికి తెరతీశాయి. ఏళ్ల తరబడి గృహ నిర్బంధంలోనే గడిపిన అంగ్‌సాన్ సూకీ సారధ్యంలోని ఎన్‌ఎల్‌డి పార్టీ ఘన విజయం సాధించి దేశ గతినే మార్చేసింది. సైనిక పాలకులు సైతం ఊహించనంత స్థాయిలో ఎన్‌ఎల్‌డికి ప్రజలు పట్టం గట్టారు. అయితే తమ అధికారాన్ని సైనిక పాలకులు పూర్తిగా వదులుకునే అవకాశం ఉందా లేక కొత్త ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరకాటంలో పడేసే అవకాశం ఉందా అన్నది వేచి చూడాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నియంతృత్వాలకు చరమగీతం పాడి ప్రజలు ప్రజాస్వామ్య బాట పట్టిన నేపథ్యంలో సూకీ సాధించిన ఈ విజయం అనేక రకాల శాంతియుత ఉద్యమాలకు ప్రేరణే అయంది. మైన్మార్‌లో ఏర్పడే ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు సైన్యం గుప్పిటే ఉంటాయన్న ఆందోళనల నేపథ్యంలో ఇక్కడి ప్రజాస్వామ్యం, సూకీ పాలన ఎంతమేరకు ఫలిస్తుందన్నది కూడా రాబోయే పరిస్థితులు పరిణామాల బట్టే ఆధారపడి ఉంటుంది.