అంతర్జాతీయం

హిల్లరీ జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 19: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమె ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే ఆరు పాయింట్ల ముందంజలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలు మరో మూడు వారాలు ఉండగా తాజాగా ఫాక్స్ న్యూస్ పోల్‌లో హిల్లరీ ప్రత్యర్థికంటే ముందుకు దూసుకుపోతున్నారు. గత వారం సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ ఏడు పాయింట్ల ముందంజలో ఉండేవారు. తాజా వీక్లీపోల్‌లో హిల్లరీ 45, ట్రంప్ 39 పాయింట్ల శాతంతో కొనసాగుతున్నారు. కాగా లిబర్టేరియన్ గ్యారే జాన్సన్ ఐదుశాతం, గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్ మూడు శాతం ఓట్లు సాధించారు. ఇప్పటి వరకు జరిగిన రెండు జాతీయ డిబెట్లలో హిల్లరీదే పైచేయ అయన నేపథ్యంలో ఈ తాజా సర్వే ఫలితాలు రాబోయే ఎన్నికలపై మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయ. ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేకపోయనా హిల్లరీకే పరిస్థితులు అనుకూలిస్తున్నాయ.

హిల్లరీ క్లింటన్ డోనాల్డ్ ట్రంప్