అంతర్జాతీయం

284 మంది ఊచకోత .. ఇరాక్‌లో ఐసిస్ ఘాతుకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోసుల్, అక్టోబర్ 23: ఇరాక్‌లో ఐసిస్ చిట్టచివరి స్థావరమైన మోసుల్‌ను ఇరాక్ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు చుట్టుముట్టినప్పుడు ఐసిస్ దాదాపు 284 మంది మగవారిని, పిల్లలను దారుణంగా కాల్చి చంపేసిందని ఇరాక్ ఇంటెలిజన్స్ వర్గాలు సిఎన్‌ఎన్‌కు తెలియజేశాయి. గత గురు, శుక్రవారాల్లో చనిపోయిన వారంతా కూడా మోసుల్ నగరంలోని దక్షిణ ప్రాంతాలనుంచి ఐసిస్‌ను తరిమి వేయడానికి సంకీర్ణ దళాలు జరుపుతున్న దాడులనుంచి కాపాడుకోవడానికి ఐసిస్ మానవ రక్షణ కవచాలుగా ఉపయోగించుకున్నవారేనని కూడా ఆ వర్గాలు తెలిపాయి. చనిపోయిన వారినందరినీ కాల్చి చంపేశారని, వారిలో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి చెప్పారు. కాల్చి చంపేసిన వీరి శవాలను ఉత్తర మోసుల్‌లోని మూతపడిన వ్యవసాయ కళాశాలలో సామూహిక ఖననం చేసినట్లు ఆ అధికారి చెప్పారు. అయితే ఈ హత్యలను ధ్రువీకరించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. కాగా మోసుల్‌పై కంట్రోల్ కోసం జరుగుతున్న పోరులో మానవ కవచాలుగా ఉపయోగించుకోవడానికి ఐసిస్ మోసుల్ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 550 కుటుంబాల వారిని బందీలుగా పట్టుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఐక్యరాజ్య సమితి శుక్రవారం పేర్కొంది. సమాలియా గ్రామానికి చెందిన 250 కుటుంబాలను, నజాఫియానుంచి 350 కుటుంబాలను బలవంతంగా మోసుల్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం ప్రతినిధి రవీనా షందాసాని చెప్పారు. ఈ గ్రామాలకు చెందిన వారిని బలవంతంగా మోసుల్‌కు తీసుకెళ్లినట్లు తమ కార్యాలయం వద్ద సాక్ష్యాలున్నాయని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ జీడ్ రాడ్ అల్ హుస్సేన్ చెప్పారు. తిరగబడిన వారిని కాల్చి చంపుతున్నట్లు కూడా తమకు వార్తలందాయని ఆయన చెప్పారు.