అంతర్జాతీయం

మరో మావో జీ జిన్‌పింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 23: ప్రస్తుత సవాళ్లను అధిగమించాలంటే చైనాకు మావోలాంటి మరో నాయకుడు అవసరమని ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్ని విధాలుగా సమర్థుడని అధికార కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. మావోకు ఉండాల్సిన లక్షణాలన్నీ జిన్‌పింగ్‌కు ఉన్నాయని వెల్లడించింది. దేశంలో జిన్‌పింగ్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ కీలక భేటీ జరపనున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. నాలుగు రోజులపాటు జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనమ్ సమావేశానికి అనేక రకాలుగా ప్రాధాన్యత ఉంది. దేశాధ్యక్షుడు, అలాగే ప్రధాని లీ కెకియాన్ మినహా మిగతా అధికారిక వ్యవస్థలో అనేక కీలక మార్పులు చేయడానికి ఈ సమావేశం సన్నద్ధమవుతోంది. 63 సంవత్సరాల జీ జిన్‌పింగ్ సారథ్యంలోని ఏడుగురు సభ్యు స్టాండింగ్ కమిటీయే ప్రస్తుతం చైనాలో అధికారాన్ని చెలాయిస్తోంది. 2012లో చైనా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ తన నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటూ జిన్‌పింగ్ దూసుకుపోతున్నారు. కేవలం అధ్యక్షుడిగానే పరిమితం కాకుండా దేశాన్ని ఆర్థికంగానూ, సైనికపరంగానూ శక్తివంతంగా తీర్చిదిద్దారని ఆ ప్రకటన స్పష్టం చేసింది.