అంతర్జాతీయం

క్వెట్టాలో 61మంది ఊచకోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వెట్టా, అక్టోబర్ 25: కల్లోలిత బలూచిస్తాన్ ప్రాంతంలోని ఓ సైనిక శిక్షణ శిబిరంపై ఐసిస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 61మంది శిక్షణలో ఉన్న పాక్ సైనికులు మరణించారు. మరో 165మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో ఇంత దారుణమైన రీతిలో పాక్‌లో ఐసిస్ మిలిటెంట్లు ఊచకోతకు పాల్పడటం ఇదే మొదటిసారి. భారీ ఆయుధాలతో విరుచుకుపడ్డ మిలిటెంట్లు కొన్ని గంటలపాటు ఈ మారణహోమం సాగించారు. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మొదలైన ఈ దాడి మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. నిద్రలో ఉన్న క్యాడెట్లను లక్ష్యంగా చేసుకుని పోలీసు శిక్షణ కాలేజీపై మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. ముందుగా ఓ పోలీసు గార్డును హతమార్చిన మిలిటెంట్లు లోపలికి ప్రవేశించి నిద్రలో ఉన్న క్యాడెట్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పాకిస్తాన్ రక్షణ బలగాలు సకాలంలో రంగంలోకి దిగడంతో మృతుల సంఖ్య తగ్గింది. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరు తమను తాము పేల్చుకుని మరణించగా, మరొకరిని పాక్ బలగాలు మట్టుబెట్టాయి. క్యాడెట్లంతా 15 నుంచి 25 ఏళ్ల వయసువారు కావడంతో ఉగ్రదాడికి భీతావహులయ్యారు. కొంతమంది సురక్షిత ప్రాంతాలవైపు పరుగులు తీయగా, మరికొంతమంది భవనంపైనుంచి దూకి పారిపోయేందుకు యత్నించారు. ఉగ్రవాదులు రష్యాకు చెందిన కలష్నికోవ్ ఆయుధాలను కలిగివున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని, క్యాడెట్లు తప్పించుకునేందుకు వీలులేకుండా కాల్పులు జరిపారని నిపుణులు విశే్లషిస్తున్నారు. ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పడటంతో ప్రాణనష్టం ఎక్కువగా సంభవించింది. మరో ఉగ్రవాదిని ఫ్రాంటియర్ కార్ప్స్ దళాలు మట్టుబెట్టాయి. చనిపోయినవారిలో ఎక్కువ శాతం శిక్షణలో ఉన్న క్యాడెట్లు కాగా, ఉగ్రదాడిని ఎదుర్కొన్న సైనిక జవాన్లు మరికొందరు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ‘పోలీస్ శిక్షణ కాలేజీలో 61మంది మృతిచెందారు. వీరిలో 60మంది క్యాడెట్లు కాగా, మరొకరు సైనిక జవాన్ ఉన్నారు’ అని అధికారులు వెల్లడించారు. గాయపడిన 165మందిని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతుండగా, వీరిలో 20మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు రహీల్ షరీఫ్ హుటాహుటిన క్వెట్టాను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మృతుల అంత్యక్రియల్లోనూ ఆయన పాల్గొన్నారు. అనంతరం తాజా పరిస్థితిని, భద్రత, సహాయక చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. ప్రధాని నవాజ్ షరీఫ్ మంగళవారం క్వెట్టాను సందర్శించి అత్యున్నత స్థాయి సమీక్ష జరిపారు. మంగళవారం అన్ని కార్యక్రమాలను నవాజ్ రద్దుచేసుకున్నారు. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సమయంలో ట్రైనింగ్ అకాడమీ హాస్టల్‌లో సుమారు 700మంది క్యాడెట్లు ఉన్నారని బలూచిస్తాన్ ప్రావిన్స్ హోమ్‌మినిస్టర్ మీర్ సర్ఫరాజ్ బుగ్తి వెల్లడించారు. అకాడమీ పరిసరాల్లో భద్రతా దళాలు మోహరించాయి. మీడియాను సైతం లోపలికి అనుమతించడం లేదు. ఉగ్రవాదులను తుదముట్టించేందుకు మూడుగంటల సమయం పట్టిందని పారామిలిటరీ ఫ్రాంటియర్ కార్ప్స్ చీఫ్ మేజర్ జనరల్ షేర్ ఆఫ్గాన్ వెల్లడించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ తాలిబన్‌కు అనుబంధ సంస్థలైన అల్-అలీమీ, లష్కర్-ఎ-ఝాంగ్వి ఉగ్రవాద గ్రూప్‌నకు చెందినవారుగా తెలుస్తోందని తెలిపారు.
క్వెట్టాలోని పోలీసు క్యాడెట్ల శిక్షణ శిబిరంపై ఆత్మాహుతి దాడి జరిగిన వెంటనే
ఆ ప్రాంతానికి చేరుకున్న పాక్ సైనికులు