అంతర్జాతీయం

మిలిటెంట్లపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 26: తమ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. ‘పొరుగుదేశాలపై దాడులు చేయాలనుకంటున్న తమ సొంతగడ్డపై ఉన్న ఉగ్రవాద ముఠాలపై చర్యలు తీసుకోవడం ద్వారా పాకిస్తాన్ ప్రాంతీయ సుస్థిరతకు నేరుగా దోహదపడగలదని మేము భావిస్తున్నాం’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ మంగళవారం విలేఖరులతో అన్నారు. దక్షిణాసియాలో ఉగ్రవాదంపై పోరాడడానికి ఆ ప్రాంతంలోని దేశాల మధ్య ఉమ్మడి, సమగ్రమైన, సహకారాత్మక పరిష్కారాలు అవసరమన్నారు. ఇది ప్రాంతీయ సమస్య అని చెప్పిన కిర్బీ ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఆ ప్రాంత దేశాలతో, ఆప్రాంతంలోని భాగస్వాములతో తాము కలిసి పని చేస్తామని, ఎందుకంటే ఇది అందరికీ ఉమ్మడి ముప్పని చెప్పారు. క్వెట్టాలో ఉగ్రదాడి అనంతరం దక్షిణాసియాలో ఉగ్రవాదంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కిర్బీ ఈ విషయం చెప్పారు. ఈ దాడిలో బాధితులకు సానుభూతిని తెలియజేసిన కిర్బీ చనిపోయిన వారిలో ఎక్కువమంది తమ పౌరులను కాపాడేందుకు శిక్షణ పొందుతున్న యువ పోలీసు కాడెట్లన్న విషయాన్ని మరిచిపోరాదని, ఇది అత్యంత పిరికిపంద చర్యే కాక భయానక దాడి అని అన్నారు. ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని అంతం చేయడంలో, శాంతి, సుస్థిరతలను నెలకొల్పే విషయంలో పాక్ ప్రభుత్వం కృషికి అమెరికా మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
వచ్చే నెల దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతామని మాజీ క్రికెటర్, ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ హెచ్చరిస్తున్న సమయంలో అమెరికా పాకిస్తాన్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం గమనార్హం. ‘పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని మేము సమర్థిస్తాం. అలాగే శాతియుతంగా నిరసన తెలిపే హక్కునూ మేము సమర్థిస్తాం. అయితే ఇది పాకిస్తానీ ప్రభుత్వ అంతర్గత సమస్య, పాకిస్తానీ అధికారులే దీనిపై మాట్లాడాలి’ అని కిర్బీ చెప్పారు.