అంతర్జాతీయం

ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 28: టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాను అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించేందుకు అనుమతిస్తే ద్వైపాక్షిక సంబంధాలకు నష్టం వాటిల్లడంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతలకు విఘాతం కలుగుతుందని చైనా శుక్రవారం భారత్‌ను బెదిరించింది. టిబెట్ దక్షిణ ప్రాంతంలో అరుణాచల్‌ప్రదేశ్ అంతర్భాగమని చైనా దీర్ఘ కాలం నుంచి వాదిస్తున్న విషయం తెలిసిందే. అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు దలైలామాను ఆ రాష్ట్రంలో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందన్న వార్తల గురించి విలేఖర్ల సమావేశంలో అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ స్పందిస్తూ, ఈ వార్తలు తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ‘్భరత్-చైనా తూర్పు సరిహద్దు విషయంలో మా వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. ఇందులో ఎటువంటి మార్పు లేదు. చైనాకు వ్యతిరేకంగా సాగుతున్న వేర్పాటువాద కార్యకలాపాల్లో దలైలామా పాలుపంచుకుంటున్నారు. భారత్-చైనా సరిహద్దుకు సంబంధించిన సమస్యల ఆయన అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం సరిగా లేదు. దలైలామా వ్యవహారంతో పాటు భారత్-చైనా సరిహద్దుకు సంబంధించిన సమస్యలు ఎంతటి తీవ్రమైనవో భారత్‌కు బాగా తెలుసు. ఇటువంటి పరిస్థితుల నడుమ భారత్, చైనా మధ్య గల వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించేందుకు దలైలామాను భారత్ ఆహ్వానిస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించడంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతకు విఘా తం కలగడం తథ్యం’ అని కాంగ్ పేర్కొన్నారు. టిబెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో రాజకీయ నిబద్ధతకు, సరిహద్దు విషయంలో ద్వైపాక్షిక ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉండాల్సిందిగా భారత్‌కు చైనా విజ్ఞప్తి చేస్తోందని ఆయన తెలిపారు.