అంతర్జాతీయం

వైట్‌హౌస్‌లో దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 31: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌లోని తన ఓవల్ ఆఫీసులో దీపాన్ని వెలిగించారు. ఈ సంప్రదాయాన్ని తరువాత వచ్చే అధ్యక్షులు కొనసాగిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేసిన ఒబామా తన ఆఫీసులో పనిచేసే ఇండియన్-అమెరికన్లతో కలిసి దీపావళి పండుగ చేసుకున్నారు. 2009లో తొలిసారి దేశాధ్యక్షుడిగా ఒబామా దీపావళి జరుపుకున్నారు. ఇప్పుడు ఓవల్ ఆఫీసులో దీపం వెలిగించిన తరువాత అనుభూతులను ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. ‘2009లో దీపావళి పండుగ చేసుకున్న జరుపుకున్న తొలి అధ్యక్షుడిని కావడం గర్వంగా ఉంది. ముంబయిలో దీపావళి రోజు నా పట్ల, మిచెల్లి పట్ల భారతీయులు చూపిన ప్రేప, అనురాగం మేం ఎప్పటికీ మరచిపోలేం’ అని ఒబామా తన ఫేస్‌బుక్‌లో స్పష్టం చేశారు. ఒబామా ఫేస్‌బుక్ పోస్టుకు విశేషమైన స్పందన వచ్చింది. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధించడంమే దీపావళి అంటూ సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలకు నెజిజన్లు లైక్లు, షేర్‌లు చేశారు. అమెరికా అంతటా దీపావళి పండుగ ఎంతో ఉల్లాసంగా జరుపుకొంటారు. హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు తమ నివాసాలను రంగురంగుల దీపాలతో అలంకరించుకుంటారు.