అంతర్జాతీయం

కాలుష్యం కోరల్లో 30కోట్ల మంది చిన్నారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 31: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 30 కోట్ల మంది బాలలు అంతర్జాతీయ మార్గదర్శకాల కంటే కనీసం ఆరు రెట్లు అధిక వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని, వీరిలో భారత్ సహా దక్షిణాసియా ప్రాంతానికి చెందిన చిన్నారులే 22 కోట్ల మంది ఉన్నారని సోమవారం విడుదల చేసిన తాజా నివేదికలో ఐక్యరాజ్య సమితి బాలల విద్యా నిధి సంస్థ (యునిసెఫ్) స్పష్టం చేసింది. ఉపగ్రహ చిత్రాలను ఆధారంగా చేసుకుని ‘క్లియర్ ది ఎయిర్ ఫర్ చిల్డ్రన్’ అనే పేరుతో ఈ అధ్యయనాన్ని నిర్వహించిన యునిసెఫ్ ఇటువంటి విశే్లషణ చేయడం ఇదే తొలిసారి. క్యూబిక్ మీటర్ గాలిలో 10 నుంచి 60 మైక్రో గ్రాముల కాలుష్యమున్న ప్రాంతాలను వేర్వేరు కేటగిరీలుగా విభజించి యూనిసెఫ్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 30 కోట్ల మంది బాలలు అంతర్జాతీయ పరిమితుల కంటే కనీసం ఆరు రెట్లు ఎక్కువగా వాయు కాలుష్యమున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని యునిసెఫ్ వెల్లడించింది.
వీరిలో దాదాపు 20 కోట్ల మంది చిన్నారులు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) నిర్దేశించిన కాలుష్య పరిమితి (క్యూబిక్ మీటర్‌కు 10 మైక్రో గ్రాములు) కంటే ఎక్కువ కాలుష్యమున్న ప్రాంతాల్లో జీవిస్తున్నారని ఈ అధ్యయనంలో తేలినట్లు యునిసెఫ్ వెల్లడించింది.