అంతర్జాతీయం

నాలుగున్నర రోజులకు ఓ జర్నలిస్టు హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 2: ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగున్నర రోజులకు ఓ జర్నలిస్టు హత్యకు గురవుతున్నాడని యునెస్కో బుధవారం విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో మొత్తం 827 మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో ఉండగా హత్యకు గురయ్యారని యునెస్కో డైరెక్టర్ జనరల్ రూపొందించిన నివేదిక పేర్కొంది. సిరియా, ఇరాక్, యెమన్, లిబియాలాంటి అరబ్ దేశాల్లో జర్నలిస్టులు అత్యధిక సంఖ్యలోప్రాణాలు కోల్పోయారని ఆ నివేదిక పేర్కొంది. లాటిన్ అమెరికా ఆ తర్వాతి స్థానంలో ఉందని జర్నలిస్టుల భద్రత, ప్రమాదంపై రూపొందించిన ఈ నివేదిక వెల్లడించింది. 2006-2015 మధ్య కాలానికి సంబంధించి ఈ నివేదిక రూపొందించారు. ఈ మరణాల్లో అత్యధిక శాతం అంటే 59 శాతం చివరి రెండేళ్ల కాలంలో అంతర్యుద్దాలు కొనసాగుతున్న ప్రాంతాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ రెండేళ్ల కాలంలో 213 మంది జర్నలిస్టులు మృతి చెందగా వారిలో 78 మంది అంటే 36.5 శాతం మంది అరబ్ దేశాల్లోనే చనిపోయారు. అయితే పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో జర్నలిస్టుల మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఆ నివేదిక పేర్కొంది. 2014లో ఈ ప్రాంతాల్లో ఒక్కరు కూడా హత్యకు గురి కాకపోగా, 2015లో 11 మంది చనిపోయారు.
హత్యకు గురయిన వారిలో విదేశీ జర్నలిస్టులకన్నా స్థానికులే ఎక్కువ మంది ఉన్నారని, మృతుల్లో దాదాపు 90 శాతం మంది వాళ్లేనని కూడా ఆ నివేదిక తెలిపింది. అయితే చివరి రెండు సంవత్సరాల్లో విదేశీ జర్నలిస్టుల మరణాలు ఒక్కసారిగా పెరిగి పోయాయని కూడా ఆ నివేదిక తెలిపింది.