అంతర్జాతీయం

అమల్లోకి ‘పారిస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 4: పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పుడమికి కొండంత వెన్నుదున్నను అందించే చారిత్రక పారిస్ ఒప్పందం శుక్రవారం ప్రపం చ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. భూ తాపాన్ని అరికడుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రపంచ దేశాలు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమల్లోకి రావాలన్నదానిపై మరో వారంలో కీలక భేటీ జరగబోతోంది. బొగ్గు, చమురు వాయువులు అపరిమిత వినియోగం వల్ల వాతావరణంలో పెరిగిపోతున్న కాలుష్య ఉద్గారాలను నియంత్రించేందుకు ధనిక, పేద తేడా లేకుండా ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ముందుకొచ్చాయి. గతంలో పర్యావరణ పరిరక్షణపై ఎన్నో శిఖరాగ్ర సదస్సులు జరిగినప్పటికీ పారిస్ తరహాలో చారిత్రకరీతిలో ప్రపంచ దేశాలన్నీ పుడమి రక్షణకు చేతులు కలపడం ఎన్నడూ జరగలేదు. ఈ ఒప్పందం అమల్లోకి రావడం పుడమికే చారిత్రక సుదినమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హోలెండ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ దేశాలన్నీ వినాశకర కాలుష్యానికి తెరదించే పుడమి పచ్చదనాన్ని పెంపొందించే చర్యలకు నడుంబిగించిన చిరస్మరణనీయ రోజుగా పారిస్ ఒప్పందం అమలను ఐరాస పర్యావరణ విభా గం అధినేత పాట్రీషియా ఎస్‌పినోసా, మొరక్కో విదేశాంగ మంత్రి సలాహెడిన్ మెజోర్ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఈ ఒప్పందం అమలు విధి, విధానాలు ఖరారు చేసేందుకు సోమవారం జరిగే ఐరాస సమావేశానికి మెజోర్ సారధ్యం వహిస్తారు. ఈ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా అన్ని దేశాలు పుడమి రక్షణ, పర్యావరణ నిబద్ధతకు సంబంధించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన కోరారు. గరిష్ట స్థాయిలో కాలుష్య ఉద్గారాల నియంత్రణకు అన్ని దేశాల్లోనూ రాజకీయ చిత్తశుద్ధి ఎంత అవసరమో ఇందుకు అవసరమైన నిధుల కల్పన అంతే అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిమాణంలో కాలుష్య ఉద్గారాల విసర్జన కొనసాగితే 2030 నాటికి పర్యావరణ విషాదం అనివార్యం అవుతుందని ఐరాస ఇప్పటికే తీవ్ర స్వరంతో హెచ్చరించింది.

పారిస్ ఒప్పందంపై సంతకం చేస్తున్న కేంద్ర మంత్రి జవదేకర్ (ఫైల్‌ఫొటో)