అంతర్జాతీయం

పుంజుకుంటున్న ముందస్తు ఓటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 4: అమెరికాలో మంగళవారం జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అయితే ఆ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలోని ముందస్తు ఓటింగ్ నిబంధన కింద ఇప్పటికే రికార్డు సంఖ్యలో 3.5 కోట్ల మంది అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీం తో 2012 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా 3.23 కోట్ల మంది ముందుగానే ఓటు హక్కు ఉపయోగించుకుని నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. అమెరికాలోని చాలా రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుని 2012లో నమోదైన రికార్డును బద్ధలు కొట్టారని అధ్యక్ష ఎన్నికల ప్రాజెక్టును నిర్వహిస్తున్న ముందస్తు ఓటింగ్ నిపుణుడు మైఖేల్ మెక్‌డొనాల్డ్ స్పష్టం చేశారు. ఉదాహరణకు నాలుగేళ్ల క్రితం టెక్సాస్‌లో నమోదైన ముందస్తు ఓటింగ్‌తో ప్రస్తుతం నమోదైన ముందస్తు ఓటిం గ్ 36 శాతానికి పెరిగిందని, అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ముమ్మర ప్రచారం నిర్వహించడంతో వీరిద్దరిలో ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణమని మెక్‌డొనాల్డ్ వివరించారు. 2008లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 29.7 శాతం మంది ముందస్తుగానే ఓటు హక్కు వినియోగించుకోగా, నాలుగేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ శాతం 31.6 శాతానికి పెరిగింది. దీంతో ప్రస్తు త అధ్యక్ష ఎన్నికల్లో ముందస్తుగా ఓ టు హక్కు వినియోగించుకు నే వారి సంఖ్య 35 శాతానికి పైగానే ఉంటుందని అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఎవరి దారి వారిదే
జాక్సన్‌విల్లే (్ఫ్లరిడా), నవంబర్ 4: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా గతంలో రెండు సార్లు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బరాక్ ఒబామాకు ఓటు వేసిన ఫ్లోరిడాలోని ప్రవాస భారతీయులు ఈసారి పార్టీ మారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు తెలుపుతామని స్పష్టం చేస్తున్నారు. అయితే వీరిలో మహిళలు మాత్రం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు అండగా నిలుస్తున్నారు. మహిళలు, చిన్న పిల్లల సంక్షేమం కోసం హిల్లరీ ఎంతో కృషి చేశారని, కనుక ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకే మద్దతు తెలుపుతామని వారు తేల్చిచెబుతుండటంతో ప్రవాస భారత ఓటర్లలో లింగ విభజన జరిగినట్లు కనిపిస్తోంది.