అంతర్జాతీయం

అగ్రపీఠంపై ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను మొత్తం అమెరికన్లకు అధ్యక్షుడిని. నేను చెప్పే ప్రతీ మాటా అత్యంత నిజాయితీతో కూడుకున్నది. సందేహాలు, అనుమానాలకు ఆస్కారం లేదు. ఎన్నికల కోసం ఓటర్లు చీలినా అమెరికా మాత్రం సమైక్యంగానే ఉండాలి. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పాటుపడటమే నా ధ్యేయం, బాధ్యత.

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇదో కొత్తశకం. మొత్తం ప్రపంచం వ్యతిరేకించినా, సొంత పార్టీ నేతలే ఈసడించుకున్నా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రియల్ హీరో అనిపించుకున్నారు. అన్నిరకాల ఆటుపోట్లు తట్టుకుంటూ.. అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ అమెరికా 45వ అధ్యక్షుడిగా అందలం ఎక్కనున్నారు. ఏవిధంగా చూసినా ట్రంప్ విజయం అమెరికా ప్రజలిచ్చిన ఓ అనూహ్యమైన, చారిత్రకమైన తీర్పే. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో 288 ట్రంప్ గెలుచుకోగలిగారు. హిల్లరీకి 215 ఓట్లు మాత్రమే వచ్చాయి. పెన్సిల్వేనియా, ఓహియో, టెక్సాస్‌వంటి కీలక రాష్ట్రాల్లో సాధించిన ఓట్లే ట్రంప్‌ను అందలం ఎక్కించాయి. వలసదారులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు అమెరికా ప్రజల మద్దతు లభించేలా చేశాయి. దేశ ఉద్యోగ వర్గాలను, ప్రస్తుత వ్యవస్థపట్ల వారికున్న వ్యతిరేకతను ట్రంప్ రాజకీయంగా మలచుకున్నారు. తన విజయాన్ని సునాయాసం చేసుకున్నారు.

చిత్రం..
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం విజయోత్సవ సభలో మాట్లాడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్