అంతర్జాతీయం

ట్రంప్ కార్డ్.. నేనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 9: ‘నేను మొత్తం అమెరికన్లకు అధ్యక్షుడిని. దేశంలో వున్న ప్రతి పౌరుడికీ అధ్యక్షుడినే’ అంటూ తన విజయోత్సవ సభలో రిపబ్లికన్ అభ్యిర్థు డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు అంటూ ఓటర్లు చీలిపోయినా ఇది దేశంలోని ప్రతిఒక్కరూ కలిసి పనిచేయాల్సిన తరుణమంటూ పిలుపునిచ్చారు. పార్టీ విభేదాలకు అతీతంగా ఈ రెండు పార్టీలూ, అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా అమెరికాను బలోపేతం చేయడానికి కలసి రావాలన్నారు. సమైఖ్య అమెరికాగా దేశాన్ని మరింత పరిపుష్టం చేయాలని, ఇది తమ ముందున్న బృహత్‌కర్తవ్యమంటూ ఉద్భోదించారు. విధానపరమైన అంశాల జోలికిపోకుండా అమెరికా ప్రస్తుత స్థితిగురించి, దాని సామర్థ్యం గురించే మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ తన విజయానికి దోహదం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అడుగడుగునా హర్షధ్వానాల మధ్య సాగిన ఆయన ప్రసంగం వివాదాలకు అతీతంగా అందరినీ అలరించింది. భార్య మెలానియా, పిల్లలు, ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్‌తో కలిసి ఆయన మాట్లాడారు. తాను చెప్పే ప్రతీ మాటా అత్యంత నిజాయితీతో కూడుకున్నదని, ఇందులో ఎలాంటి సందేహాలు, అనుమానాలకు ఆస్కారం లేదన్నారు. ఓట్లపరంగా ఒటర్లు చీలినా అమెరికా మాత్రం సమైక్యంగానే ఉండాలన్నారు. ఇందుకు ప్రతిఒక్కరూ ఓ బాధ్యతగా ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పాటుపడటమే తన ధ్యేయమని, ఇది తన కీలక బాధ్యతన్నారు. అమెరికా అధ్యక్షుడిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనను వ్యతిరేకించిన వ్యక్తులు సైతం కలిసి రావాలని, తనకు మార్గనిర్దేశన చేయాలని అభ్యర్థించారు. దేశ పౌరులు అందరి ఉజ్వల భవిష్యత్ కోసం తాను పాటుపడతానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరితోనూ నిజాయితీగా వ్యవహరిస్తానని, అన్ని దేశాలతోను సత్సంబంధాలను కొనసాగిస్తానని తెలిపారు.
అమెరికాతోపాటు కలిసి పనిచేయడానికి వచ్చే అన్ని దేశాలకూ చేయూతనిస్తానని, అద్భుతమైన స్నేహబంధాన్ని నిర్మిస్తానని తెలిపారు. అన్ని జాతులు, మతాలు, నేపథ్యాలు కలిగిన అమెరికన్లు అందరూ ఓ ఉద్యమంగా పనిచేయడం వల్లే తన గెలుపు సాధ్యమైందన్నారు. వీరందరి ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తానని తెలిపారు. తన ప్రభుత్వం అందరి క్షేమం, సంక్షేమం కోసం పాటుపడుతుందని స్పష్టం చేశారు. ప్రతి అమెరికా పౌరుడు ప్రతి అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దుతానని అన్నారు. ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోనివారిని సైతం అక్కున చేర్చుకుంటానని పేర్కొన్న ట్రంప్, దేశాభివృద్ధికి సంబంధించి తన వద్ద అద్భుతమైన ప్రణాళిక ఉందన్నారు.
అమెరికాను ప్రపంచంలోని ఎక్కడాలేనటువంటి అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని, వృద్ధిరేటును రెండింతలు చేస్తానన్నారు. ఇక అత్యుత్తమమే అమెరికా లక్ష్యమన్నారు. దేశ ఆశలను ఈడేర్చటం, బలంగా నిర్భయంగా దూసుకుపోవడమే లక్షణంగా అమెరికాను తీర్చిదిద్దుతానన్నారు. అమెరికా ప్రయోజనాలే తన తొలి ప్రాధాన్యత అంటూ ఉద్ఘాటించిన ఆయన, నిజాయితీగా ప్రతి ఒక్కరితోనూ పని చేస్తానన్న వాస్తవాన్ని విస్మరించకూడదని ప్రపంచ దేశాలకు స్పష్టం చేశారు. వివాదాలు, వైషమ్యాలు పక్కనపెట్టి ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా భాగస్వామ్యంతో పని చేస్తామన్నారు.