అంతర్జాతీయం

అమెరికాకు ఇక చీకటిరోజులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 10: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఆ దేశానికి చీకటి రోజులు మొదలైనాయని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అల్‌ఖైదా జిహాదీలు సంబరపడిపోతున్నారని, కొంతమంది అయితే మరో అడుగుముందుకు వేసి ట్రంప్ చేతిలో అమెరికా అంతమైపోతుందని కూడా అభిప్రాయపడుతున్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్ విజయం సాధించినట్లు ప్రకటించగానే జిహాదీ సంస్థలకు చెందిన ప్రముఖ వ్యూహకర్తలంతా కూడా సామాజిక మాధ్యమాల్లో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక తెలిపింది. ట్రంప్ విజయాన్ని అమెరికా పాలిట ‘చీకటి రోజుల’ ఆరంభంగా ఐఎస్, అల్‌ఖైదాతో సంబంధాలున్న సామాజిక మాధ్యమాలు అభివర్ణించాయని, దేశంలో అంతర్గత అశాంతి, కొత్తగా విదేశాల్లో సైనిక చర్యలతో సూపర్ పవర్‌గా అమెరికా శక్తి సన్నగిల్లిపోతుందని ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థకు అనుబంధంగా ఉండే అల్-మిన్బర్ జిహాదీ మీడియా నెట్‌వర్క్‌లాంటి సంస్థలు అభిప్రాయపడ్డాయని ఆ పత్రిక పేర్కొంది.
ట్రంప్‌లాంటి రాజకీయ అనుభవ శూన్యుడి ముందుచూపు లేని నిర్ణయాలు, ముస్లింల పట్ల ఆయన ద్వేషభావం కారణంగా ప్రపంచ దేశాల దృష్టిలో అమెరికా ప్రతిష్ఠ దిగజారిపోతుందని, జిహాదీలంతా కూడా ఏకమవుతారనేది వారి అంచనా అని ఆ పత్రిక విశే్లషించింది.