అంతర్జాతీయం

పౌర అణు ఇంధన ఒప్పందానికి లైన్ క్లియర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, నవంబర్ 10: భారత్, జపాన్‌ల మధ్య మరింత బలమైన రీతిలో ఆర్థిక, ద్వైపాక్షిక బంధం విస్తృతం చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన చేపట్టారు. గురువారం న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ఆయన శుక్రవారం జపాన్ ప్రధాని షింజో అబేతో విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఈ సందర్భంగా పౌర అణు ఇంధన సహకార ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉందన్న సంకేతాలు బలంగా అందుతున్నాయి. అదే విధంగా ఇరు దేశాలు మొత్తం 12 ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. వార్షికంగా ఇరుదేశాల మధ్య జరిగే ఈ శిఖరాగ్ర సదస్సు అనేక రకాలుగా ఇరు దేశాల ప్రధానుల మధ్య పరస్పర భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల వంటి అంశాలపై లోతైన అవగాహన కుదిరే అవకాశం ఉంది. అదే విధంగా ఈ అంశాలపై కీలక ఒప్పందాలకు బలమైన ఆస్కారం కనిపిస్తోంది. నైపుణ్య అభివృద్ధి, వౌలిక సదుపాయల కల్పనలో మరింత విస్తృత సహకారం వంటివి కూడా ఇరువురి నేతల చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయి. తన అధికారిక పర్యటనలో భాగంగా జపాన్ వ్యాపార, వాణిజ్యవేత్తల నుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడతారు. పర్యటనకు బయలుదేరే ముందు ఢిల్లీలో మాట్లాడిన మోదీ శుక్రవారం జపాన్ ప్రధానితో జరిగే సమావేశం అన్ని విధాలుగా ఫలప్రదం కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సహకార తీరుతెన్నులను ఆమూలాగ్రం సమీక్షిస్తామని, దీనిని మరింత విస్తృతం చేసే చర్యలను చేపడతారని తెలిపారు. ఇరు దేశాల మధ్య కుదిరే 12 ఒప్పందాల్లో సమగ్ర రీతిలో అన్ని అంశాలూ ప్రస్తావనకు వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా, పౌర అణు ఇంధన ఒప్పందం కుదరడానికి వీలుగా ఇందుకు సంబంధించిన చర్చలను ఇరు దేశాల ప్రతినిధులు ముగించారు. గత డిసెంబర్‌లో జపాన్ ప్రధాని షింజో భారత పర్యటనలో భాగంగా పౌర అణు ఇంధన ఒప్పందానికి సంబంధించి లాంచనప్రాయంగా ఒప్పందం కుదిరింది. కొన్ని సాంకేతిక, న్యాయపరమైన అంశాల వల్ల తుది నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇటీవలి కాలంలో ఈ తతంగం అంతా పూర్తికావడంతో అణు ఒప్పందానికి మార్గం మరింత సుగమమైంది.

ఢిల్లీ విమానాశ్రయం నుంచి జపాన్ పర్యటనకు బయలుదేరుతున్న ప్రధాని మోదీ