అంతర్జాతీయం

జపాన్‌తో అణుబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, నవంబర్ 11: భారత్- జపాన్‌ల మధ్య చారిత్రక పౌర అణు ఇంధన ఒప్పందం కుదిరింది. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై భారత్ సంతకం చేయనప్పటికీ..మినహాయింపునిస్తూ ఈ కీలక ఒప్పందాన్ని జపాన్ కుదుర్చుకుంది. పౌర అణు ఇంధన రంగంలో ఇరు దేశాల మధ్య విస్తృత స్థాయి సహకారానికి ఈ కీలక ఒప్పందం మరింతగా మార్గాన్ని సుగమం చేస్తుంది. దీనితో పాటు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తూ భిన్న రంగాలకు సంబంధించి మరో తొమ్మిది ఒప్పందాలపైనా ఇరు దేశాలు శుక్రవారం సంతకం చేశాయి. జపాన్ ప్రధాని షింజో అబేతో విస్తృత స్థాయి చర్చల అనంతరం మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ఇరు దేశాల మధ్య స్వచ్ఛమైన ఇంధన భాగస్వామ్యానికి పౌర అణు ఇంధన ఒప్పందం మార్గం సుగమం చేస్తుంది. అలాగే అణు ఇంధన శాంతియుత వినియోగానికి ఇది దోహదం చేస్తుంది’అని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య అణు రంగంలో కుదిరిన ఒప్పందం వాతావరణ మార్పుల నిరోధానికి తోడ్పడుతుందన్నారు. ఈ కీలక ఒప్పందం కుదరడంలో సహకరించిన జపాన్ ప్రభుత్వానికి, పార్లమెంట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బలమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్, జపాన్‌లు పారదర్శకత, దాపరికం లేని సమాజాన్ని, చట్టం అమలును ప్రోత్సహిస్తాయన్నారు. రెండు దేశాల మధ్య ఆరేళ్ల పాటు అత్యంత కఠినతరమైన రీతిలో జరిగిన చర్చల అనంతరం ఈ చారిత్రక ఒప్పందానికి ఆస్కారం ఏర్పడింది. అణు ఇంధన శాంతియుత వినియోగంపై నరేంద్ర మోదీతో ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని జపాన్ ప్రధాని షింజో అన్నారు. అణు ఇంధనాన్ని భారత్ శాంతియుత ప్రయోజనాల కోసమే వినియోగించుకోవడానికి ఈ ఒప్పందం ఓ న్యాయపరమైన నిబంధనావళేనని అన్నారు. అలాగే అణు వ్యాప్తి నిరోధన విషయంలోనూ భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి ఇది మరింతగా తోడ్పడుతుందని చెప్పారు. అణ్వస్త్రాలు లేని ప్రపంచమే తన ఆశయమని, అందులో భాగంగానే భారత్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. అణు ఇంధనాన్ని శాంతియుత ప్రయోజనాల కోసమే వినియోగిస్తామని 2008లోనే భారత్ ప్రకటించిందని, అలాగే తదుపరి అణు పరీక్షలపైనా మారటోరియం విధించిందని షింజో గుర్తు చేశారు. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, దక్షిణ కొరియా, మంగోలియా, ఫ్రాన్స్, నమీబియా, కెనడా, ఫ్రాన్స్, కజఖస్తాన్, ఆస్ట్రేలియాలతో పౌర అణు ఇంధన ఒప్పందాన్ని ఇప్పటి వరకూ భారత్ కుదుర్చుకుంది. నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో భాగంగా కుదుర్చుకున్న ఇతర ఒప్పందాల్లో రైల్వేలు, వౌలిక సదుపాయాలు, అంతరిక్షం, వ్యవసాయ రంగాల్లో సహకారం, పెట్టుబడులకు సంబంధించినవి ఉన్నాయి.

చిత్రం... పౌర అణు ఇంధన ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ప్రధాని షింజో అబేతో కరచాలనం చేస్తున్న ప్రధాని మోదీ