అంతర్జాతీయం

మీడియానే ఎగదోస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/ న్యూయార్క్, నవంబర్ 11: అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని వ్యతిరేకిస్తూ వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా అమెరికాలో ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వేలాది మంది ఆందోళనకారులు న్యూయార్క్, చికాగో నగరాలను ముట్టడించారు. మరోవైపు, మీడియా తనకు వ్యతిరేకంగా ‘ప్రొఫెషనల్ ప్రొటెస్టర్స్’ (ఆందోళనలు చేయడమే పనిగా పెట్టుకున్నవారు)ను రెచ్చగొడుతోందని ట్రంప్ ఆరోపించారు. వరుసగా రెండో రోజు రాత్రి అమెరికాలోని వివిధ నగరాలలో ట్రంప్ ఎన్నికకు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. అధ్యక్ష భవనం శే్వత సౌధం వద్ద, ట్రంప్‌కు చెందిన కార్యాలయాల వెలుపల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, కొలొరాడో, లాస్ ఏంజిల్స్, సియాటిల్ నగరాలలో ట్రంప్ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. అయితే చాలాచోట్ల ప్రదర్శనలు శాంతియుతంగానే జరిగాయి. డజన్ల సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే మొదటి రోజు జరిగిన ఆందోళనలతో పోలిస్తే రెండో రోజు ఆందోళనల్లో ప్రజలు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఆందోళనల తీవ్రత కూడా తక్కువగా ఉంది. ఆందోళనకారుల్లో కొంత మంది అమెరికాలోని వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. కాలిఫోర్నియాలోని ఓ నగరంలో జరిగిన ఆందోళన సందర్భంగా తలెత్తిన హింసలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. ఆందోళనకారులు 40 చోట్ల నిప్పు పెట్టారు. తన ఎన్నికకు వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న నిరసనపై శుక్రవారం తొలిసారి స్పందించిన ట్రంప్ మీడియా రెచ్చగొట్టిన ప్రొఫెషనల్ ప్రొటెస్టర్స్ ఈ ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆందోళనలు అనుచితమైనవని, అన్యాయమైనవని దేశ రాజధాని వాషింగ్టన్ డిసి నుంచి న్యూయార్క్‌కు చేరుకున్న ట్రంప్ ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన వాషింగ్టన్ డిసిలో అధ్యక్ష పదవినుంచి దిగిపోనున్న బరాక్ ఒబామాను, తరువాత ప్రతినిధుల సభ స్పీకర్ పౌల్ ర్యాన్, అమెరికా కాంగ్రెస్‌లోని ఇతర నాయకులతో భేటీ అయ్యారు.
ఇదిలా ఉండగా, ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలపై ఒబామా వైఖరి ఏంటని అడగ్గా, ప్రజలకు నిరసన వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని, అయితే ఈ నిరసన ప్రదర్శనలు శాంతియుతంగా జరగాల్సిన అవసరం ఉందని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ బదులిచ్చారు.