అంతర్జాతీయం

మనమూ రద్దుచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 11: భారత్ తరహాలోనే పెద్దనోట్లు రద్దుచేయాలని పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అవినీతి, నల్లధనం నిర్మూలించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్లను రద్దుచేసింది. పాకిస్తాన్‌లోనూ 500,1000 రూపాయల నోట్లు రద్దుచేయాలని పాక్ పార్లమెంటులో ఆర్థిక వ్యవహారాల స్థాయి సంఘం సిఫార్సు చేసింది. ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పిపిపి) సెనేటర్ ఒసామా సైఫుల్లాఖాన్ స్థాయి సంఘ సమావేశంలో మాట్లాడుతూ పెద్దనోట్ల వల్లే మనీ లాండరింగ్, అవినీతి పెచ్చుపెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, నల్లధనాన్ని కట్టడి చేయడానికి భారత్ తీసుకున్న చర్యను ఉదాహరిస్తూ పాకిస్తాన్‌లోనూ 500,1000 రూపాయల నోట్లు రద్దు చేయాలని అన్నారు. ఈమేరకు సెనేట్‌లో ఓ తీర్మానం చేసిన ప్రభుత్వానికి సమర్పించారు.