అంతర్జాతీయం

ట్రంప్ హయాంలో భారీగా మేధో వలస!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 12: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం ‘మేథో వలస’కు దారితీస్తుందని, విదేశాల్లో పుట్టి అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన పరిశోధకులు ఇప్పుడు ఆ దేశాన్ని వీడివెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్తవ్రేత్తలు భయాందోళన చెందుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. జెనెటిక్ పారిశ్రామిక, విద్యా రంగాలకు చెందిన 1,600 నిపుణల అభిప్రాయాలను సేకరించి జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ న్యూస్ (జెన్) ఈ సర్వే నిర్వహించింది. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పరిశోధనా కార్యక్రమాలకు సరిగా నిధులు అందక సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ (స్టెమ్) విద్యకు విఘాతం కలుగడం తథ్యమని ఈ సర్వేలో అత్యధికంగా 57.11 శాతం మంది స్పష్టం చేయగా, ఎటువంటి మార్పు ఉండదని 24 దాదాపు శాతం మంది, ట్రంప్ హయాంలో విద్యా రంగ పరిశోధనా కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని కేవలం 9.79 శాతం మంది అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రభుత్వం ‘స్టెమ్’ విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వదని దాదాపు 51.74 శాతం మంది ఈ సర్వేలో అభిప్రాయపడ్డారని, దీనిని బట్టి చూస్తుంటే దీంతో అమెరికా నుంచి భారీగా మేథో వలస జరగవచ్చని, ముఖ్యంగా బయో టెక్నాలజీ రంగానికి ఈ ముప్పు మరీ అధికంగా ఉండవచ్చన ఆందోళన కలుగుతోందని ‘జెన్’ వ్యవస్థాపక సిఇఓ మేరీ అన్ లీబెర్ట్ తెలిపారు.