అంతర్జాతీయం

అమెరికాలో చదువు ఇక కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్టన్, నవంబర్ 14: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక అంతర్జాతీయ విద్యార్థుల పాలిట శాపంగా మారనుందా? అవుననే అంటున్నారు నిపుణులు. ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవటానికి వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై సుమారు 35 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని వారంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇమ్మిగ్రేషన్‌కు పరిమితి విధిస్తానని, మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని, అమెరికాకు వలసవచ్చే ముస్లింలు రిజిస్టర్ చేసుకోవటం తప్పనిసరి చేస్తానని ట్రంప్ వాగ్దానాలు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అంతర్జాతీయ విద్యార్థులతో జరిపిన ఓ సర్వేలో ట్రంప్ గెలిస్తే అమెరికాకు రావాలని ఆసక్తి చూపిన వారి సంఖ్యా బాగా తగ్గింది. 118 దేశాలకు చెందిన 40వేల మంది విదార్థులపై నిర్వహించిన ఓ సర్వేలో 60శాతం మంది ట్రంప్ గెలిస్తే అమెరికాకు రావటంపట్ల అనాసక్తత ప్రదర్శించారు. ట్రంప్ ఎన్నిక ఆర్థిక వృద్ధిరేటును మందగింపజేస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. అమెరికా చరిత్రలో నిరుడు మొట్టమొదటిసారి యూనివర్శిటీలలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పది లక్షలు దాటింది. వివిధ దేశాల నుంచి వలస వస్తున్న విద్యార్థుల్లో చైనా, భారత్‌లు ప్రధాన దేశాలుగా ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో సౌదీ అరేబియా ఉంది. అంతర్జాతీయ విద్యా సంస్థ సీఈఓ అలన్ గాడ్‌మన్ మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే అమెరికాకు విద్యార్థులు చదువుకోవడానికి వస్తారని ఆయన అన్నారు.
కొనసాగుతున్న నిరసనలు
న్యూయార్క్: డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావటాన్ని నిరసిస్తూ అమెరికాలో నిరసనల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇమ్మిగ్రెంట్లు, వారి లాయర్లు న్యూయార్క్‌లో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ‘ఇతరుల పట్ల ఏహ్యభావం అమెరికాను గొప్ప చేయలేదు’ అని నినాదాలు చేశారు. సుమారు వెయ్యిమంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. లాస్ ఏంజిలిస్, శాన్‌ఫ్రాన్సిస్కో, ఫిలడెల్ఫియా లాంటి ఇతర నగరాల్లో కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి.

ట్రంప్ తప్పుకోవలసిందేనంటూ ఆందోళనకారులు నిరసనలు చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ను తాము తిరస్కరిస్తున్నామని వారన్నారు. కాగా, ఓరెగాన్‌లో 71మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అటు బెర్లిన్‌లోని బ్రాండెన్‌బర్గ్ గేట్ దగ్గర అమెరికా దౌత్య కార్యాలయం ముందు సుమారు 300మంది ఆందోళన చేశారు.

న్యూయార్క్‌లోని ట్రంప్ హౌస్ వద్ద పోలీసుల బందోబస్తు