అంతర్జాతీయం

కాశ్మీర్‌పై పాక్ కొత్త పాచిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 23: ప్రపం చ వ్యాప్తంగా కాశ్మీర్ వివాదాన్ని ప్రధానాంశం చేయడంతో పాటు భారత్‌లో ప్రధాని మోదీ అనుసరిస్తున్న ‘తీవ్రవాద విధానాల’ను వ్యతిరేకిస్తున్న ప్రజలను ఆకర్షించేలాగా కాశ్మీర్ వివాదంపై ఆచరణ సాధ్యమైన విధానాన్ని రూపొందించడానికి పాకిస్తాన్ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ మంగళవారం సెనేట్‌లో ఈ విషయం ప్రకటించినట్లు డాన్ దినపత్రిక తెలిపింది. రక్షణ, హోం, సమాచార మంత్రిత్వ శాఖలతో పాటు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి)లకు చెందిన సీనియర్ అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ చౌదరి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని, ఇతర సభ్యులను అవసరం మేరకు నియమించుకుంటారని అజీజ్ తెలిపారు. కాశ్మీర్‌పై భారత్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అవసరమైన ‘వాస్తవాంశాల పత్రాల’ (్ఫ్యక్ట్ షీట్)ను తయారు చేయడంతో పాటు ‘కాశ్మీర్ స్వాతం త్య్ర పోరాటా’న్ని ఎల్లవేళలా ప్రధానాంశంగా కొనసాగించడానికి అవసరమైన మీడి యా వ్యూహాన్ని రూపొందించేందుకు సమాచార శాఖ కార్యదర్శి అధ్యక్షతన మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వివరించారు. ఈ కమిటీలో కూడా రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి మంత్రిత్వ శాఖలతో పాటు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్, ఐఎస్‌ఐ, ఐబిలకు చెందిన ప్రతినిధులు ఉంటారని ఆయన తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా కాశ్మీర్ వివాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి అవసరమైన సమగ్ర వ్యూహాన్ని రూ పొందించ వలసిందిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజి మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం గురించి, విద్రోహ కార్యకలాపాలకు అది మద్దతు ఇవ్వడం గురించి, కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై విస్తృతంగా ప్రచారం చేయడానికి చర్యలు తీసుకున్నట్టు వివరించారు.