అంతర్జాతీయం

ఆ మూడు రాష్ట్రాల్లో రీకౌంట్ కోరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 24: ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులకు పోలయిన ఓట్లను తారుమారు చేసేందుకు సైబర్ దాడి జరగలేదని నిర్ధారించుకోవడానికి కీలక రాష్ట్రాలయిన విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో రీకౌంట్‌ను కోరాలని ఎన్నికల న్యాయవాదులు, డేటా నిపుణులు హిల్లరీ క్లింటన్‌కు సలహా ఇచ్చారు. అయితే ఎన్నిల్లో అక్రమాలు జరిగాయని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తారుమారు చేవారనేదానికి ఎలాంటి సాక్ష్యాధారాలులేవని వారంటున్నారు. రీకౌంట్‌ను కోరడానికి గడువు దగ్గర పడుతున్నందున ఈ మూడు రాష్ట్రాల్లో రీకౌంటింగ్‌ను కోరనున్నారా లేదా అనే దానిపై హిల్లరీ క్లింటన్ ప్రచార బృందం మాత్రం స్పందించలేదు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ విస్కాన్‌సిన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో అతి తక్కువ మెజారిటీతో గెలుపొందగా, మిచిగాన్ రాష్ట్రంలోను చాలా తక్కువ ఆధిక్యత సాధించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాలు కూడా డెమోక్రటిక్ పార్టీకి మద్దతు తెలిపే రాష్ట్రాలుగా మొదటినుంచీ భావిస్తూ వచ్చారు.
ఓటింగ్ హక్కుల కేసులను వాదించే న్యాయవాది(అటార్నీ) జాన్ బోనిఫాజ్, యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ సెంటర్ ఫర్ కంప్యూటర్ సెక్యూరిటీ అండ్ సొసైటీ డైరెక్టర్ జె అలెక్స్ హాల్డర్‌మాన్‌ల నేతృత్వంలోని ఈ బృందం గత వారం హిల్లరీ క్లింటన్ ప్రచార నిర్వాహకులను కలిశారు. ఎలక్ట్రానిక్ మిషన్లపై ఆధారపడిన కొన్ని కౌంటీల్లో హిల్లరీ క్లింటన్‌కు అనుకున్నదానికన్నా తక్కువ ఓట్లు వచ్చి ఉండవచ్చనే అనుమానం సమావేశంలో వ్యక్తమయినట్లు ఈ సమావేశం గురించి మొట్టమొదట వెల్లడించిన ‘న్యూయార్క్ మ్యాగజైన్’ తెలిపింది. అయితే సైబర్ దాడి జరిగిందనడానికి, లేదా ఓటింగ్ అక్రమాలు జరిగాయనడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని హాల్డర్‌మ్యాన్ బుధవారం సోషల్ మీడియాలో ఉంచిన ఓ వ్యాసంలో స్పష్టం చేశారు. అయితే అలాంటి అవకాశాలు లేవని నిర్ధారించుకోవడం కోసం ఓట్ల రీకౌంట్‌ను కోరడమొక్కటే మార్గమని ఆయన ఆ వ్యాసంలో స్పష్టం చేశారు.
డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ మధ్య ఎన్నికలు నువ్వా, నేనా అన్నట్లుగా జరిగిన దృష్ట్యా రీకౌంట్‌ను కోరాలనే సూచన సాధారణంగానే డెమోక్రాట్లకు సంతోషం కలిగించే విషయమే కానీ, ప్రభుత్వం ఏర్పాటు, పరిపాలనపై దృష్టిపెట్టిన రిపబ్లికన్లకు మాత్రం అది రుచించకపోవచ్చు. దీనిపై వ్యాఖ్యానించాల్సిందిగా ట్రంప్ ఎంపిక చేసుకుంటున్న మంత్రివర్గ సహచరులను కోరగా వారు స్పందించలేదు. కాగా, ఈ మూడు రాష్ట్రాల్లో రీకౌంట్ కోరడానికి తుది గడువు శుక్రవారంతో ముగియనుంది.