అంతర్జాతీయం

రీ కౌంటింగ్ నిర్ణయం కుంభకోణం లాంటిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 27: అమెరికా అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను ఎవరూ శంకించడం గానీ, అగౌరవపర్చడం గానీ చేయరాదని, ఆ ఫలితాలను ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాలని ఆ ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అన్నారు. స్వింగ్ స్టేట్‌గా పరిగణించే విస్కాన్సిన్ రాష్ట్రంలో ఓట్లను మళ్లీ లెక్కించాలన్న నిర్ణయాన్ని ‘కుంభకోణం’గా ఆయన అభివర్ణించారు. విస్కాన్సిన్‌లో మళ్లీ ఓట్లు లెక్కించాలని పట్టుబడుతున్న వారిలో ముందున్న గ్రీన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జిల్ స్టెయిన్ కేవలం ఆ ఒక్క రాష్టల్రోనే కాకుండా మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో కూడా రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్ విస్కాన్సిన్‌తో పాటు ఇతర స్వింగ్ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, మిచిగాన్‌లలో తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం విదితమే. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడానికి ముందు ఈ రాష్ట్రాల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించిన ట్రంప్ ఇప్పుడు ఆ ఎన్నికలు పూర్తయ్యాయని, వాటి ఫలితాలను ఎవరూ శంకించడం గానీ, అగౌరవపర్చడం గానీ చేయకుండా అందరూ గౌరవించి తీరాలని వాదిస్తుండటం గమనార్హం.