అంతర్జాతీయం

భారత్‌తో ఉద్రిక్తతలు తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, డిసెంబర్ 7: ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి అన్ని మార్గాలను భారత్ మూసేసిందని పాకిస్తాన్ ఆరోపించింది. కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించడంతోపాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిపై ఉందని స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ప్రత్యేక సలహాదారు సయ్యద్ తారిఖ్ ఫతేమి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా నియమిడులైన ఆంటోనియో గట్టర్స్‌తో సమావేశం సందర్భంగా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఐరాసకు సంబంధించిన ఇతర కీలక నేతలతో కూడా ఫతేమి సమావేశమయ్యారు. వాస్తవాధీన రేఖ ప్రాంతంలో భారత్ తీవ్రస్థాయిలో కాల్పుల ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అలాగే కాశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ఫతేమి ఆరోపించారు.
ద్వైపాక్షిక చర్చల విషయంలో అన్ని మార్గాలను భారత్ మూసివేసినందున సమస్యను పరిష్కరించాల్సిన నైతిక బాధ్యత ఐరాస పైనే ఉందని స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కాశ్మీర్ సమస్యతోపాటు ఇతర సమస్యను నివృత్తిచేయాలని ఐరాస నాయకత్వంలోని ఫతేమి కోరినట్లు పాకిస్తాన్ మిషన్ వెల్లడించింది.