అంతర్జాతీయం

పాకిస్తాన్‌లో విమానం కూలి 47మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 7: పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పిఐఏ)కు చెందిన విమానం ఒకటి బుధవారం అబోటాబాద్ సమీపంలోని హవెలియన్ వద్ద కొండ ప్రాంతంలో కూలిపోవడంతో విమానంలోని 47 మంది చనిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఖైబర్ ఫక్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని చిత్రాల్‌నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన ఈ విమానం కొద్ది సేపటికే రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. సాయంత్రం 4.40 గంటలకు ఈ విమానం ఇస్లామాబాద్‌లోని బేనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. విమానం రాడార్ స్క్రీన్‌పైనుంచి అదృశ్యమవడానికి ముందు పైలట్ ట్రాఫిక్ కంట్రోల్‌కు డిస్ట్రెస్ కాల్ ఇచ్చినట్లు పిఐఏ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. విమానంలో తొమ్మిది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా 42 మంది ప్రయాణికులు, ఇద్దరు ఎయిర్‌హోస్టెస్‌లు, ముగ్గురు పైలట్లు ఉన్నట్లు ఆ ప్రతినిధి చెప్పారు. ప్రయాణికుల్లో ఒకప్పుడు ప్రముఖ గాయకుడు, ప్రస్తుతం ఇస్లాం మతబోధకుడుగా మారిన జునైద్ జంషెడ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మతబోధనలకోసం జంషెడ్ చిత్రాల్ వెళ్లినట్లు ఆయన సోదరుడు తెలిపారు. విమానం కూలినచోటికి పాక్ సైన్యం ఒక హెలికాప్టర్‌ను, కొంతమంది సైనికులను పంపించింది. హవేలిన్ సమీపంలోని కొండప్రాంతంలో ఓ విమానం కూలిపోవడం తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం కూలిపోయిన చోటునుంచి దట్టమైన పొగలు ఎగసిపడుతూ ఉండడం కనిపించిందని తెలిపారు.

చిత్రం... విమానం ప్రమాదానికి గురైనట్లు తెలిసిన వెంటనే ఇస్లామాబాద్‌లోని బేనజీర్ భుట్టో
అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదలైన హడావిడి