అంతర్జాతీయం

టైమ్ వార్షిక మేటి వ్యక్తి ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, డిసెంబర్ 7: టైమ్ మ్యాగజైన్ ఏటా ప్రకటించే అత్యంత మేటి వ్యక్తిగా 2016 సంవత్సరానికి అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అమెరికా రియల్ ఎస్టేట్ టైకూన్, అత్యంత వాడివేడిగా, ఉత్కంఠగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీని ఓడించి విజేతగా నిలిచిన ట్రంప్‌ను పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీలో ముందంజలో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ట్రంప్‌ను టైమ్ ప్రకటించటం ఆశ్చర్యకరం. టైమ్ ప్రకటనకు సామాజిక మాధ్యమంలో విపరీతంగా స్పందన లభించింది. దాదాపు 3 కోట్ల 95లక్షల మంది టైమ్ ప్రకటనను రీట్వీట్ చేయగా, రెండున్నర కోట్ల మంది లైక్ చేశారు. ఇది తనకు ఎంతో గౌరవమని, ప్రతిష్ఠాత్మకమైన పత్రికలో తనకు ఈ కీర్తి రావటం ఎంతో ఆదృష్టమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్ ఓటులో మెజారిటీ సాధించినా, తుది వాస్తవ ఫలితాలలో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ రెండోస్థానంలో నిలిచారు. అమెరికా ఎన్నికల సంవత్సరంలో ప్రతిసారీ విజేతగా నిలిచిన వ్యక్తినే ఆ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తూ వస్తోంది. 2008, 2012లలో ఒబామా, 2000, 2004లో జార్జి బుష్, 1992లో బిల్‌క్లింటన్ ఇలా వరుసగా ఎన్నికల సంవత్సరాల్లో కొత్తగా ఎన్నికైన వారినే టైమ్ ప్రకటించింది. జర్మన్ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ నిరుడు పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎన్నికయ్యారు.