అంతర్జాతీయం

బై అమెరికా.. హైర్ అమెరికా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 14:అమెరికా ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తానని, గత పాలకులు దేశ ప్రయోజనాలను ఘోరంగా విస్మరించారని దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు. ఇతర దేశాలతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందాలు, ఒడంబడికలన్నీ కూడా దేశ ప్రయోనాలకు ద్వితీయ ప్రాధాన్యతనిచ్చినవేనని, ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండదని ట్రంప్ అన్నారు. ‘బై అమెరికా.. హైర్ అమెరికా’ (అమెరికా వస్తువులనే కొనండి..అమెరికన్లనే ఉద్యోగాల్లోకి తీసుకోండి) అన్న నినాదంతోనే ముందుకు వెళతానని విస్కాన్‌సిన్‌లో జరిగిన కృతజ్ఞతా ర్యాలీలో ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడం మినహా తనకు మరే లక్ష్యం లేదన్నారు. గత పాలకులు ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కూడా అమెరికాకు నష్టం కలిగించినవేనని ఆరోపించారు. వీటిని లోతుగా పరిశీలిస్తే అమెరికా ప్రయోజనాలకు ఎంతగా నష్టం జరిగిందో స్పష్టమవుతుందన్నారు. అమెరికాను ఫణంగా పెట్టి ఇతర దేశాలకు పట్టం కట్టడమన్నది ఇక సాగదని చెప్పారు. ఇలాంటి ఒప్పందాల వల్ల అమెరికా వార్షిక వాణిజ్య లోటు 800 బిలియన్ డాలర్లకు పెరిగిపోయిందన్నారు. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్టా) వల్ల అమెరికా ఉత్పాదక రంగంలో మూడింట ఒక వంతు ఉద్యోగాలను కోల్పోయామని, దాదాపు 70వేల ఫ్యాక్టరీలూ చేజారిపోయాయని ట్రంప్ అన్నారు.