అంతర్జాతీయం

ప్రపంచ టాప్ టెన్‌లో మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, డిసెంబర్ 14: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావశీలత కలిగిన టాప్ టెన్ నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తొమ్మిదో స్ధానం లభించింది. మొత్తం 74 మంది నేతలకు సంబంధించి ఫోర్బ్స్ పత్రిక నిర్వహించిన ఈ సర్వేలో వరుసగా నాలుగో ఏడాది కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు రెండో స్థానం దక్కింది. భారత్‌లో నరేంద్ర మోదీకి తిరుగులేని జనాదరణ ఉందని, ఇటీవలి కాలంలో విస్తృతంగా విదేశీ పర్యటనలు చేపట్టడం ద్వారా బరాక్ ఒబామా, జి జిన్‌పింగ్ తరహాలో అంతర్జాతీయ నాయకుడిగా ఎదిగారని ఆ పత్రిక పేర్కొంది. అలాగే వాతావరణ మార్పుల నిరోధానికి జరిగిన అంతర్జాతీయ ప్రయత్నాల్లోనూ మోదీ క్రియాశీలక భూమిక పోషించారని తెలిపింది. నల్లధనం, అవినీతిని అంతం చేసేందుకు పెద్ద కరెన్సీ నోట్లను అనూహ్య రీతిలో మోదీ రద్దు చేసిన విషయాన్ని కూడా ఫోర్బ్స్ పత్రిక ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా 7.4బిలియన్ జనాభా ఉందని వీరిలో కేవలం 74మందికి మాత్రమే ప్రపంచ గమనాన్ని మలుపుతిప్పే సామర్థ్యం ఉందని తెలిపింది.