అంతర్జాతీయం

మరోసారి ఆస్కార్ బరిలో ఎఆర్ రెహ్మాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏంజెల్స్, డిసెంబర్ 14: భారత కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసిన ప్రసిద్ధ సింగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ మరోసారి ఆస్కార్ బరిలో నిలిచారు. బ్రెజిల్‌కు చెందిన ప్రఖ్యాత సాకర్ క్రీడాకారుడు పీలే జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన ‘పీలే: బర్త్ ఆఫ్ ఏ లెజెండ్’ చిత్రానికి రెహ్మాన్ సంగీతం అందించారు. ఒరిజనల్ స్టోరీ, ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆయన ఆస్కార్‌కు పోటీ పడుతున్నారు. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి రెహ్మాన్ రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. అప్పుడూ ఒరిజనల్ స్టోరీ, ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆయనకు ఆస్కార్ ఉత్తమ అవార్డులు దక్కాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆస్కార్ అవార్డుల పోటీకి 145 ఎంట్రీలు వచ్చాయి. అందులో సంగీత దర్శకుడు రెహ్మాన్ కూడా ఉండడం భారత్‌కు గర్వకారణంగా చెప్పవచ్చు. అలాగే పీలే బయోపిక్‌కు దర్శకత్వం వహించిన జెఫ్ జింబాలిస్ట్, మైఖెల్ జింబాలిస్ట్‌ల పేర్లు జాబితాలో ఉన్నారు.