అంతర్జాతీయం

భారత్‌కు లైన్‌క్లియర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 28: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి రూపొందించిన ఓ ముసాయిదా ప్రతిపాదన ఆ కూటమిలో భారత్ ప్రవేశానికి మార్గాన్ని సుగమం చేస్తోందని, అయితే పాకిస్తాన్‌కు మాత్రం అవకాశం ఉండకపోవచ్చని అమెరికాకు చెందిన ఆయుధ నియంత్రణ సంస్థ ఒకటి అంటోంది. అయితే సభ్యత్వానికి సంబంధించిన నిబంధనలను సడలించడం వల్ల అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నీరుగారి పోతుందని కూడా ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ (ఏసిఏ)హెచ్చరిస్తోంది. భారత్, పాకిస్తాన్‌లాంటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకాలు చేయని దేశాలు ఎలా ఎన్‌ఎస్‌జిలో చేరవచ్చో వివరిస్తూ ఎన్‌ఎస్‌జి మాజీ అధ్యక్షుడయిన రఫాయెల్ మారియానో గ్రోస్సీ రెండు పేజీల డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు గత వారం అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌జి అధ్యక్షుడుగా ఉన్న దక్షిణకొరియాకు చెందిన సోంగ్ యంగ్-వాన్ తరఫున గ్రోస్సీ పని చేస్తున్నారని, ఆయన డాక్యుమెంట్‌కు సెమీ అధికారిక పత్రం హోదా ఉందని ‘డాన్’ పత్రిక తెలిపింది. కాగా, ఎన్‌ఎస్‌జిలో పాకిస్తాన్ చేరకుండా భారత్ అడ్డుకోకుండా నిరోధించడానికి ఎన్‌పిటిలో సభ్యత్వం లేని ఒక దేశం దానిలో చేరడానికి కుదిరిన ఏకాభిప్రాయాన్ని అడ్డుకోకుండా ఉండడానికి మరో నాన్-ఎన్‌పిటి సభ్య దేశం ఒక అవగాహనకు రావలసి ఉంటుందని ఆ ముసాయిదా ప్రతిపాదించినట్లు కూడా ఆ పత్రిక తెలిపింది. అయితే గ్రోస్సీ పేర్కొన్న ఫార్ములాను వ్యతిరేకించడానికి పాకిస్తాన్‌కు ఇప్పటికీ అవకాశముందని ఏసిఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింబల్ అంటున్నారు. ఎన్‌ఎస్‌జిలో సభ్య దేశంగా చేరడానికి భారత్ విషయంలో ఏదయితే కొలమానాన్ని అమలు చేశారో పాకిస్తాన్‌కు కూడా అదే కొలమానాన్ని పాటించాలని, అయితే ఎన్‌ఎస్‌జి సభ్య దేశాలతో అది వాణిజ్యం కొనసాగించాలంటే అణ్వస్త్రాలకు సంబంధించి పూర్తిస్థాక్షి రక్షణల విషయంలో అది విడిగా ఎన్‌ఎస్‌జినుంచి మినహాయింపు పొందాల్సి ఉంటుందని ఆ డాక్యుమెంట్ చెప్తోందని ఆయన వివరించారు. తాను ఇప్పటికే ఎన్‌ఎస్‌జి సభ్య దేశాలతో వాణిజ్యం కొనసాగిస్తున్నానన్న కారణంగా భారత్ ఈ కూటమిలో సభ్యత్వాన్ని కోరుతోంది.
ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఎన్‌ఎస్‌జిలో చేరడానికి ముందు ఏ దేశమైనా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందంపై ఇప్పటికీ సంతకాలు చేయని మూడు దేశాల్లో భారత్ కూడా ఉంది. మిగతా రెండు దేశాలు పాకిస్తాన్, ఇజ్రాయెల్. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోగా, ఆ తర్వాత పాకిస్తాన్ కూడా దరఖాస్తు చేసుకొంది. అమెరికాతో పాటు పలు అగ్రరాజ్యాలు భారత్ దరఖాస్తుకు మద్దతు తెలిపాయి కానీ చైనా, మరో అరడజను దేశాలు భారత్ సభ్యత్వాన్ని అడ్డుకొన్నాయి. భారత్ ఎన్‌ఎస్‌జిలో సభ్య దేశంగా చేరాలంటే అన్ని సభ్య దేశాల ఏకాభిప్రాయం కావాలి.