అంతర్జాతీయం

ట్రంప్‌కు సాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 7: డొనాల్డ్ ట్రంప్ ఎన్ని వ్యాఖ్యలు చేసినా సరే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడానికి రష్యా సాయం చేసిందనే వాదనలపై అమెరికా ఇంటెలిజన్స్ ఏజన్సీలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అనధికారిక నివేదికల ప్రకారం ట్రంప్‌కు సాయం చేయమని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నతాధికారులను ఆదేశించారని అనధికారిక నివేదికలు అంటున్నాయి. అయితే రష్యా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. అంతేకాదు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై హ్యాకింగ్ ప్రభావం ఏమీ లేదని ట్రంప్ సైతం అంటున్నారు. అయితే ట్రంప్‌కు సాయంకోసం క్రెమ్లిన్ కచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేసిందని అమెరికా ఇంటెలిజన్స్ నివేదికలో ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఒక ప్రచారాన్ని చేపట్టాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2016లో ఆదేశించినట్లు తాము బలంగా నమ్ముతున్నామని జాతీయ ఇంటెలిజన్స్ విభాగం అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సమర్పించిన 31 పేజీల నివేదికలోని 25వ పేజీలో ఉంది. ముఖ్యంగా అమెరికా ఎన్నికల ప్రక్రియపై ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కడానికి, అలాగే డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజయావకాశాలను దెబ్బ తీయాలని కూడా పుతిన్ అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు. అయితే రష్యా ఈ ఆరోపణలను ఇదివరకే ఖండించింది. కాగా, డెమోక్రటిక్ పార్టీ ఇ-మెయిల్ వ్యవస్థను రష్యా హ్యాక్ చేయడంపై సమగ్రమైన దర్యాప్తుకు ఒబామా ఇటీవల ఆదేశించడం తెలిసిందే. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా ప్రభావితం చేయడంపై ఇంటెలిజన్స్ వర్గాలు ఇటీవల ట్రంప్‌ను కలిసి వివరించారు. అప్పటినుంచి ట్రంప్ స్వరంలో కొంత మార్పు వచ్చింది. అంతేకాకుండా అమెరికా ఇంటెలిజన్స్ వర్గాలను విమర్శించడం మానుకున్నారు కూడా.