అంతర్జాతీయం

రష్యా, చైనా మనకు సాటిరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మనకెవరూ సాటిలేరు. చైనా, రష్యాలు ఏమీ చేయలేవు. కలిసికట్టుగా నిలబడ్డాం. భవిష్యత్తు విజయాలను సాధిద్దాం. ప్రజాస్వామ్యమే అమెరికాకు పట్టుగొమ్మ. దీన్ని పరిరక్షించుకుంటేనే భవిత. వివక్షను అంతం చేయాలి. అసమానతలను రూపుమాపాలి. అమెరికా రాజ్యాంగ పునాదులను బలోపేతం చేయడం మనందరి కర్తవ్యం. భయపడితే ప్రజాస్వామ్యానికే ముప్పు. అమెరికా ఎదుగుదలకు దోహదం చేసిన విలువలే భవితకు పునాది. ఎనిమిదేళ్ల క్రితం నల్లజాతీయుడిగా అమెరికా అధ్యక్ష పదవి చేపట్టి చరిత్ర సృష్టించాను. ఇప్పటికీ దేశంలో జాతి వివక్ష కోరలు చాస్తోంది. సామాజిక విచ్ఛిత్తికి కారణమవుతోంది. అయితే అలాంటి ధోరణులను తిప్పికొట్టాలి. ఈ ఎనిమిదేళ్లలో అన్నివిధాలుగా అమెరికా ఎదిగింది. శక్తిమంతమైంది. అమెరికాను భయపెట్టే వారికి భద్రతే ఉండదు. బిన్ లాడెన్ సహా వేలాదిమంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఐసిస్‌కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను కూడగట్టాం. అమెరికా అధ్యక్షుడుగా ఎనిమిదేళ్లుగా పనిచేయడం, మీకు సేవ చేయడం నాకు గర్వకారణం.’’
-అమెరికా ప్రజలకు గుడ్‌బై చెబుతూ
ఇచ్చిన సందేశంలో బరాక్ ఒబామా