అంతర్జాతీయం

మన ఆధిపత్యానికి తిరుగులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, జనవరి 11: ప్రపంచ ఆధిపత్యం విషయంలో రష్యా, చైనా దేశాలు అమెరికాకు ఎంతమాత్రం సాటిరావని అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. రాజ్యాంగానికి అందులో నిబిడీకృతమై ఉన్న విలువలతో కూడిన విధానాలకు అమెరికా పౌరులు పునరంకితమైతే దేశానికి ఓటమే లేదని దేశాధ్యక్షుడిగా తన వీడ్కోలు సందేశంలో స్పష్టం చేశారు. ఏ రకమైన విలువలకోసం, వ్యవస్థకోసం దశాబ్దాలుగా అమెరికా పాటుపడుతూ వచ్చిందో వాటిని పరిరక్షించుకోవాలన్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఎంత ఆశాభావంతో అధ్యక్ష పదవిని చేపట్టానో అంతకుమించిన ఆశాభావంతోనే తాను నిష్క్రమించబోతున్నానని చెప్పారు. ఏ విధంగా చూసినా ఈ ఎనిమిదేళ్లలో అమెరికా మరింత ఉత్తమంగా శక్తిమంతంగా మారిందన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ని మట్టుబెడతామని, అమెరికాకు చేటు చేయాలనుకునే ఎవరూ కూడా సురక్షితంగా ఉండలేరని హెచ్చరించారు. జాత్యహంకారం, అసమానతలు, వివక్షల నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికను పరోక్షంగా ప్రస్తావించిన ఆయన, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి అమెరికా పౌరుడు అంకిత భావంతో కృషి చేయాలన్నారు. తన సొంత రాష్టమ్రైన చికాగోలో 20వేల మంది మద్దతు దారులను ఉద్దేశించి మాట్లాడిన ఒబామా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశావాదాన్ని విడనాడకూడదని, ప్రతి ఒక్కరూ ఓ నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నించాలన్నారు. 2008లో తన ఎన్నికకు దోహదం చేసిన ‘యస్ వి డిడ్, ఎస్ వి కెన్’ అన్న నినాదాన్ని పునరుద్ఘాటించారు ఆయన. ‘మార్పు రావాలంటే నా సామర్థ్యం మీద కంటే దాన్ని సాధించేందుకు మీ మీద మీకు నమ్మకం ఉండాలి’ అని ఉద్ఘాటించారు. అమెరికా రాజ్యాంగం ప్రవచించిన సిద్ధాంతాలన్నింటినీ త్రికరణ శుద్ధిగా పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని విడనాడకూడదని స్పష్టం చేశారు. దాదాపు 50 నిమిషాలపాటు ప్రసంగించిన ఒబామా దేశీయ, అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు. భయపడితే లేదా తిరోగమిస్తే ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుందని, ఇప్పటివరకు ఈ ఉన్నత విధానాన్ని ఏ విధంగా పరిరక్షించుకుంటూ వచ్చామో మరింత స్ఫూర్తిదాయక రీతిలో దీన్ని కాపాడుకోవాలన్నారు. విలువల పతనాన్ని అరికట్టాలని విదేశాలనుంచి వచ్చే ముప్పుల పట్ల నిరంతరం జాగరూకతతో ఉండాలని పిలుపునిచ్చారు. అమెరికా చరిత్రలో తొలిసారిగా దేశాధ్యక్ష పదవిని చేపట్టిన నల్ల జాతీయుడిగా తాను సరికొత్త చరిత్రను సృష్టించారని గుర్తు చేసిన ఒబామా, ఇప్పటికీ అమెరికా సమాజంలో జాతి వివక్ష అన్నది వెర్రితలలు వేస్తోందని హెచ్చరించారు. ఈ జాడ్యాన్ని రూపుమాపేందుకు ఆ విధంగా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ నెల 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టడంతో దేశాధ్యక్షుడిగా ఒబామా పాలనకు తెరపడుతుంది. తన తాజా ప్రసంగాన్ని ‘గుడ్‌బై అమెరికా’ అంటూ మొదలెట్టిన ఒబామా శాంతియుతంగానే అధికార మార్పిడి జరుగుతుందని హామీ ఇచ్చారు. ముస్లింల పట్ల, ఇతర మైనార్టీల పట్ల ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావించిన ఒబామా ఎవరి పట్లా వివక్ష ఉండకూడదంటూ హర్షధ్వానాల మధ్య పిలుపునిచ్చారు. అమెరికా పౌరులు ఎంత జాతీయ భావంతో ఉన్నారో, దేశంలో నివసిస్తున్న ఇతర దేశాల పౌరులు కూడా అంతే దేశభక్తిని కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు అమెరికా శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని, విలువల పరిరక్షణే ధ్యేయంగా పాటుపడిందని తెలిపారు. మానవహక్కులు, మహిళల హక్కులు ఇలా విలువలకు సంబంధించిన ప్రతి అంశంపైనా అమెరికా దృష్టి పెట్టిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటంలో ఉదాసీనత తగదని, దీనికి ఏ మూలనుంచి ముప్పు వచ్చినా విస్మరించటానికి వీల్లేదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో పటిష్ఠతకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ఉపాధి కల్పన, గృహకల్పన, విద్య, క్రిమినల్ జస్టిస్ వంటి అంశాల విషయంలో వివక్షను సహించటానికి వీల్లేదన్నారు. ఇది సాధ్యం కావాలంటే ప్రతి ఒక్కరిలోనూ ఈ దిశగానే మార్పు రావాలన్నారు.

చికాగోలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో అభివాదం చేస్తున్న ఒబామా దంపతులు