కృష్ణ

గన్నవరం ఎయిర్‌పోర్టు న్యూ టెర్మినల్ భవనం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, జనవరి 11: అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో తెలుగు ఖ్యాతిని సాటిచెప్పే కళాత్మక చిత్రాలతో గన్నవరం ఎయిర్‌పోర్టు న్యూ టెర్మినల్ భవనం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ బాబు ఎ తెలిపారు. మంగళవారం ఆయన టెర్మినల్ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పచ్చని గ్రీనరీని, సౌకర్యవంతమైన విశ్రాంత హాల్‌లో నూతన భవనం నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 150 కోట్ల వ్యయంతో 14 నెలల కాలంలో భవన నిర్మాణపు పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. తుపాను వంటి విపత్తులను తట్టుకునే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయానశాఖ మంత్రి పి అశోక్‌గజపతిరాజు, కేంద్ర మంత్రులు ఎం వెంకయ్య నాయుడు, సుజానా చౌదరి గురువారం లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. నూతన రన్‌వేకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. భూమి పూజ చేయనున్న స్థలాన్ని నూతన టెర్మినల్ భవనం, ఎరైవల్, డిపార్చర్, సామాన్లు, కంటినర్లు, విశ్రాంతి గదులు, విఐపిల లాంజ్ రూంలను ఆయన పరిశీలించి ఉదయం కల్లా వీటిని శుభ్రపర్చాలని ఆదేశించారు. భూమి పూజ అనంతరం జరిగే సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. విస్తరణకు ఎంతో విలువైన భూములు ఇచ్చిన 400 మంది రైతులు కూర్చొందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎంపి కొనకళ్ల నారాయణ, కేసినేని నాని, ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ పాల్గొంటారని తెలిపారు. డిసిపి కోయ ప్రవీణ్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం మధుసూధనరావు, నూజివీడు ఆర్డీఓ చెరుకూరి రంగయ్య, తహశీల్దార్ ఎం మాధురి, ఏసిపి రాజీవ్‌కుమార్ తదితరులు కలెక్టర్ బాబు ఏ తోపాటు పాల్గొన్నారు.